Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరాచీ: పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో తప్పును ఎట్టకేలకు ఒప్పుకున్నాడు. అంతేగాక తాను చేసిన తప్పును దేశ ప్రజలంతా తనను క్షమించాలని ప్రాధేయపడ్డాడు. 'నా పరిస్థితిని అర్థం చేసుకోవాలని క్రికెట్ బోర్డు, అభిమానులు, ప్రజలను కోరుకుంటున్నా. దయచేసి నన్ను మన్నించండి. బుకీ అనుభట్ను కలిసి చాలా పెద్ద తప్పుచేశా. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియజేయలేదు. అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నా... ఇలాంటి ఘోర తప్పిదాలు యుువ ఆటగాళ్లు చేయ వద్దంటూ' కనేరియా మీడియా పరంగా క్షమాపణలు కోరాడు.