Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంగ్లాండ్‌తో గాలె టెస్టు ఆఖరు
- ప్రకటించిన లంక వెటరన్ స్పిన్నర్
కొలంబో : టెస్టు క్రికెట్ చూసిన అత్యంత విజయవంతమైన లెఫ్టార్మ్ స్పిన్నర్, శ్రీలంక వెటరన్ ఆటగాడు రంగన హెరాత్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. వచ్చే నెలలో ఇంగ్లాండ్‌తో ఆడనున్న గాలె టెస్టు కెరీర్లో ఆఖరు ఆట అని ప్రకటించాడు. ఈ మేరకు శ్రీలంక క్రికెట్ బోర్డు సోమవారం వెల్లడించింది. గత కొంత కాలంగా మోకాలి గాయంతో ఇబ్బంది పడుతున్న 40 ఏండ్ల హెరాత్, 2016లోనే వన్డే, టీ20లకు దూరమయ్యాడు. 19 ఏండ్ల క్రితం ఎక్కడైనా కెరీర్ మొదలు పెట్టాడో, అదే చోట కెరీర్‌కు వీడ్కోలు పలికేందుకు సిద్ధమయ్యాడు హెరాత్. దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ఉండగానే జట్టులోకి వచ్చిన హెరాత్.. తొలినాళ్లలో అతడి నీడలోనే ఉండిపోయాడు. ముత్తయ్య వీడ్కోలుతో ఏర్పడిన భారీ శూన్యాన్ని భర్తీ చేయటంలో హెరాత్ కొంత మేరకు సక్సెస్ అయ్యాడు. 92 టెస్టుల్లో 430 వికెట్లు కూల్చిన రంగన హెరాత్ 34 సార్లు 5 వికెట్లు, 9 సార్లు 10 వికెట్ల ప్రదర్శన చేశాడు. శ్రీలంక దిగ్గజం మురళీధరన్ సైతం 2010లో గాలె వేదికగానే కెరీర్‌ను ముగించిన సంగతి తెలిసిందే.