Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోహ్లిపై తమీమ్ ఇక్బాల్ ప్రశంసలు
దుబాయ్ : వన్డే క్రికెట్లో వేగంగా పది వేల పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకున్న సూపర్ స్టార్ విరాట్ కోహ్లికి అరుదైన ప్రశంస దక్కింది. ఇప్పటికే పరుగుల యంత్రంలా పిలువబడుతున్న కోహ్లిపై ఇక్బాల్ ప్రశంసల వర్షం కురిపించాడు. బంగ్లాదేశ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ భారత సారథిని ప్రశంసలతో ముంచెత్తాడు. ' విరాట్ కోహ్లి బ్యాటింగ్ తీరు చూస్తుంటే, అతడు మానవుడేనా అనిపిస్తుంది. అతడు బ్యాటింగ్కు వచ్చిన ప్రతిసారి సెంచరీ సాధిస్తాడనే అనిపిస్తుంటుంది. అతడి ఫిట్నెస్పై తీసుకునే జాగ్రత్త, ఆటపై చూపించే అంకితభావం నిజంగా నమ్మశక్యం కానివి. మూడు ఫార్మాట్లలో అతడే నంబర్ వన్. విరాట్ ఆటను చూసి ఆస్వాదించి, నేర్చుకోవాలని ఉంటుంది. అతడో అద్భుత ఆటగాడు. 12 ఏండ్లుగా ఎంతో మంది గొప్ప ఆటగాళ్లతో కలిసి ఆడుతున్నాను. అందరికీ కొన్ని బలమైన అంశాలున్నాయి. కానీ విరాట్ కోహ్లిలా మరెవ్వరూ ఇంతటి ఆధిపత్యం చెలాయించలేదు' అని తమీమ్ ఇక్బాల్ పేర్కొన్నాడు