Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిల్లర్, డుప్లెసిస్ శతకాలు
హోబర్ట్ : వరుస ఓటముల తర్వాత ఓ వన్డే విజయం సాధించిన ఆనందం ఆస్ట్రేలియాలో ఎంతోసేపు నిలువలేదు!. రెండో వన్డేలో నెగ్గిన ఆసీస్‌ను చివరి మ్యాచ్‌లో చిత్తు చేసిన దక్షిణాఫ్రికా మూడు మ్యాచుల వన్డే సిరీస్‌ను 2-1తో వశపర్చుకున్నది. ఆదివారం హోబర్ట్‌లో జరిగిన నిర్ణయాత్మక వన్డేలో కెప్టెన్ డుప్లెసిస్ (125, 114 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్స్‌లు), డెవిడ్ మిల్లర్ (139, 108 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్స్‌లు) శతకాలతో చెలరేగటంతో దక్షిణాఫ్రికా 40 పరుగుల తేడాతో గెలుపొందింది. వీరిద్దరి శతకాలతో తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ 320/5 భారీ స్కోరు సాధించింది. ఛేదనలో షాన్ మార్ష్ (106) శతకానికి తోడు స్టోయినిస్ (63), కారీ (42) రాణించినా ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 280/9 పరుగులే చేయగల్గింది. సఫారీ సీమర్లు డెల్ స్టెయిన్, రబాడ చెరో మూడు వికెట్లతో ఆసీస్‌ను శాసించారు. డెవిడ్ మిల్లర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.