Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 35-33తో బెంగాల్‌పై గెలుపు
- ప్రొ కబడ్డీ లీగ్ 6 సీజన్
న్యూఢిల్లీ : ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 6లో హర్యానా స్టీలర్స్ ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా నిలిచాయి. నాకౌట్‌కు చేరాలంటే ప్రతి మ్యాచ్‌లో నెగ్గాల్సిన స్థితిలో హర్యానా మరో విజయం సాధించింది. 35-33తో రెండు పాయింట్ల తేడాతో బెంగాల్ వారియర్స్‌ను చిత్తు చేసింది. ఆఖరు నిమిషం వరకూ హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో హర్యానా మెరుపు విజయం సొంతం చేసుకున్నది. హర్యానా స్టార్ రైడర్ మోను గోయత్ 8 రైడ్ పాయిట్లు, నాలుగు ట్యాకిల్స్‌తో అదరగొట్టాడు. వికాష్ ఖండోలా ఐదు పాయింట్లు, సునీల్ మూడు ట్యాకిల్స్‌తో రాణించారు. బెంగాల్ తరఫున మణిందర్‌సింగ్ 11, రవీంద్ర రమేశ్ 7 పాయింట్లతో మెరిసినా ఫలితం లేకపోయింది. జోన్-ఎ నుంచి ఇప్పటికే యు ముంబా, గుజరాత్‌లు ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నాయి. మరో విజయంతో హర్యానా ప్రస్తుతం మూడో స్థానంలో కొనసాగుతోంది.