Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 82 ఏండ్ల రికార్డు బ్రేక్
- టెస్టుల్లో వేగంగా 200 వికెట్లు
- పాక్ బౌలర్ యాసిర్ షా రికార్డు
అబుదాబి: టెస్టుల్లో వేగంగా 200 వికెట్ల మైలురాయిని చేరిన బౌలర్‌గా పాకిస్థాన్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షా రికార్డు సృష్టించాడు. కేవలం 33 టెస్టుల్లో షా అరుదైన ఘనతను అందుకున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడోదైన చివరి టెస్టు నాలుగోరోజు విలియం సోమర్విల్లే (4)ను వికెట్ల ముందు అడ్డంగా దొరికిన షాతో.. 82 ఏండ్ల రికార్డును తిరగరాశాడు. గతంలో ఆస్ట్రేలియా స్పిన్నర్ క్లారీ గిమ్మెట్స్ (36 టెస్టులు) 1936లో దక్షిణాఫ్రికాపై జొహన్నెస్‌బర్గ్‌లో సాధించిన రికార్డును యాసిర్ అధిగమించాడు. అయితే, యాసిర్ షా (2/107) తన స్పిన్ మాయాజాలాన్ని ప్రదర్శించినా.. కేన్ విలియమ్సన్ (139 బ్యాటింగ్) శతకంతో కివీస్‌ను మెరుగైన స్థితిలో నిలబెట్టాడు. 26/2తో గురువారం ఆటను కొనసాగించిన కివీస్.. రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ఆటముగిసే సమయానికి విలియమ్సన్తోపాటు హెన్రీ నికోల్స్ (90 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఐదో వికెట్‌కు విలియమ్సన్, నికోల్స్ 212 పరుగుల అభేద్యమైన భాగస్వామ్యం నెలకొల్పారు. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 274, పాకిస్థాన్ 348 పరుగులు చేశాయి.