Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాకీ ప్రపంచకప్ 2018
భువనేశ్వర్ (ఒడిశా) : ఇంగ్లాండ్ క్రాస్ ఓవర్ మ్యాచ్‌లో నెగ్గి హాకీ ప్రపంచకప్ క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. సోమవారం జరిగిన తొలి క్రాస్ ఓవర్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 2-0తో ఇంగ్లాండ్ గెలుపొందింది. 25వ నిమిషంలో కాల్నన్, 44వ నిమిషంలో టేలర్లు ఇంగ్లాండ్‌కు గోల్స్ కొట్టారు. తొలి క్వార్టర్లలో న్యూజిలాండ్ కంటే ఎంతో మెరుగ్గా కనిపించిన వరల్డ్ నం.8 ఇంగ్లాండ్.. ద్వితీయార్థంలో మరింత ఆధిపత్యం సాధించింది. ఐదో నిమిషంలోనే పెనాల్టీ కార్నర్ పొందినా గోల్ చేయలేని ఇంగ్లాండ్.. కివీస్‌కు ఎక్కడ అవకాశం ఇవ్వలేదు. బలమైన ఇంగ్లీష్ డిఫెన్స్‌ను ఛేదించి న్యూజిలాండ్ గోల్ కొట్టలేకపోయింది. బుధవారం జరిగే తొలి క్వార్టర్ఫైనల్లో ఒలింపిక్ మెడలిస్ట్ అర్జెంటీనాతో ఇంగ్లాండ్ అమీతుమీ తేల్చుకోనున్నది. మరో క్రాస్ ఓవర్ మ్యాచ్‌లో అర్జెంటీనాకు షాకిచ్చిన ఫ్రాన్స్ గట్టెక్కింది. తొలిసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న చైనాపై 1-0తో ఫ్రాన్స్ నెగ్గింది. గట్టి పోటీనిచ్చిన చైనాపై 36వ నిమిషంలో గోల్‌తో ఫ్రాన్స్ బతికిపోయింది.