Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-డిఫెండింగ్ చాంప్ కరొలినాకు షాక్
-ఫెడరర్, నడాల్ ముందంజ
-ఆస్ట్రేలియన్ ఓపెన్ 2019
మెల్బోర్న్ : రష్యా భామ, మాజీ వరల్డ్ నం.1 మరియా షరపోవా మెల్బోర్న్లో మెరిసింది. డిఫెండింగ్ చాంపియన్, మూడో సీడ్ కరొలినా వొజ్నియాకిపై విజయంతో ప్రీ క్వార్టర్స్‌లో ప్రవేశించింది. మూడు సెట్ల పాటు సాగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో 6-4, 4-6, 6-3తో వొజ్నియాకిని ఓడించింది. రెండో సీడ్ ఎంజెలిక్ కెర్బర్ 6-1, 6-0తో వరుస సెట్లలో బ్రిటన్ అమ్మాయి బిరెల్పై గెలుపొందగా, పెట్రా క్విటోవా 6-1, 6-4తో స్విస్ ప్లేయర్ బెన్సిచ్‌ను ఓడించింది. అమెరికా స్టార్ స్టెఫానీ స్టిఫెన్స్ 7-6(8-6), 7-6(7-5)తో మాట్రిచ్పై ఉత్కంఠ మ్యాచ్‌లో గట్టెక్కింది. టైబ్రేకర్‌కు దారి తీసిన రెండు సెట్లలో మెరుగ్గా ఆడిన స్టిఫెన్స్ తర్వాత రౌండ్‌కు చేరుకోగలిగింది. మరో అమెరికా అమ్మాయి కొలిన్స్ 6-3, 6-2తో కరొలినా గార్సియాపై విజయం సాధించి నాల్గో రౌండ్లో అడుగుపెట్టింది.
పురుషుల సింగిల్స్‌లో వెటరన్ స్టార్ రోజర్ ఫెడరర్, రఫెల్ నడాల్ ముందంజ వేశారు. మూడో రౌండ్లో అలవోక విజయాలతో ప్రీ క్వార్టర్స్‌కు చేరుకున్నారు. అమెరికా ఆటగాడు టేలర్ ఫ్రిట్జ్‌పై 6-2, 7-5, 6-2తో ఫెడరర్ గెలుపొందాడు. 11 ఏస్‌లు సంధించిన ఫెడరర్, మూడు అనవసర తప్పిదాలకు పాల్పడినా ప్రత్యర్థికి ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. ఆస్ట్రేలియా ప్లేయర్ అలెక్స్ డీ మీనర్పై నడాల్ గెలుపొందాడు. 6-1, 6-2, 6-4తో సునాయాసంగా ప్రీ క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. అర్జెంటీనా ఆటగాడు డీగోపై 5-7, 6-3, 7-5, 6-4తో గెలుపొందిన థామస్ బెర్డిచ్, క్వార్టర్స్ బెర్త్ కోసం నడాల్‌తో ఢకొీట్టనున్నాడు. నికోలస్‌పై 6-3, 3-6, 7-6(9-7), 6-4తో నెగ్గిన గ్రీస్ ఆటగాడు స్టిఫానస్.. తర్వాతి మ్యాచ్‌లో ఫెడరర్‌ను ఎదుర్కొనున్నాడు. మారిన్ సిలిచ్ 4-6, 3-6, 6-1, 7-6(10-8), 6-3తో, రాబర్టో బటిస్టా ఆగట్ 6-4, 7-5, 6-4తో, గ్రిగర్ దిమిత్రోవ్ 7-6(7-5), 6-4, 6-4తో మూడో రౌండ్లో నెగ్గి ముందంజ వేశారు.