Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోహ్లిపై మైకెల్ క్లార్క్ ప్రశంస
మెల్బోర్న్ : పరుగుల యంత్రం, భారత క్రికెట్ సూపర్‌స్టార్ విరాట్ కోహ్లికి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ గొప్ప కితాబిచ్చాడు. వన్డే క్రికెట్ ఆడిన వారిలో విరాట్ కోహ్లియే గొప్పోడని తేల్చేశాడు!. ' నా వరకూ, వన్డే క్రికెట్ ఆడిన వారిలో విరాటే గొప్ప క్రికెటర్. భారత్ తరఫున కోహ్లి ప్రదర్శన, సాధించిన ఘనతలు చూశాక అతడే గొప్పోడని చెప్పేందుకు ఎటువంటి సందేహం అక్కర్లేదు' అని క్లార్క్ అన్నాడు. కోహ్లి 219 వన్డేల్లో 10,385 పరుగులు చేశాడు. 59 బ్యాటింగ్ సగటుతో ఏకంగా 39 శతకాలు బాదాడు. క్రికెట్ మ్యాచులు నెగ్గటం పట్ల కోహ్లి ఫ్యాషన్‌కు గౌరవం ఇవ్వాలి. నిజమే, అతడికి దూకుడు ఎక్కువ. కానీ అతడి అంకితభావాన్ని ఎవ్వరూ ప్రశ్నించలేరు. ఎంతో సాధించాడు. అందుకే వన్డేల్లో అతడే గొప్పోడు' అని క్లార్క్ కితాబిచ్చాడు.