Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అలవోకగా సెమీస్‌లో అడుగు
- సెమీస్ చేరిన సిట్సిపాస్, క్విటోవా
- ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్
మెల్బోర్న్ : స్పెయిన్ బుల్ రఫెల్ నడాల్‌కు ఎదురులేకుండా పోయింది. క్వార్టర్స్‌లో ఫ్రాన్స్ సవాల్‌ను అలవోకగా ఎదుర్కొన్న నడాల్ వరుస సెట్లలో విజయం సాధించి, సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. ప్రీ క్వార్టర్స్‌లో టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌కు షాకిచ్చిన గ్రీస్ కుర్రాడు స్టెఫానొస్ సిట్సిపాస్‌తో ఫైనల్లో చోటు కోసం నడాల్ పోరాడనున్నాడు. మహిళల సింగిల్స్‌లో చెక్ రిపబ్లిక్ భామ పెట్రా క్విటోవా సెమీస్‌కు చేరుకున్నది. లోకల్ స్టార్ బర్టీపై విజయంతో క్విటోవా టోర్నీలో ముందంజ వేసింది.
ఫ్రాన్సెస్ టిఫోపై 6-3, 6-4, 6-2తో నడాల్ వరుస సెట్లలో గెలుపొందాడు. ప్రతీ సెట్లో ఫ్రాన్సెస్ పోరాడినా, నడాల్‌ను ఎదురించలేదు. నాలుగు బ్రేక్ పాయింట్లు సాధించి నడాల్ సెమీస్‌కు చేరుకున్నాడు. మరో క్వార్టర్స్‌లో రాబర్టో బటిస్టా ఆగట్ (స్పెయిన్)పై స్టిఫానొస్ 7-5, 4-6, 6-4, 7-6(7-2)తో విజయం సాధించింది. తొలిసారి గ్రాండ్‌స్లామ్ సెమీస్‌కు చేరిన సిట్సిపాస్ తనను తానే ఆశ్చర్యానికి గురిచేసుకున్నట్టు ఉందని సంబురపడ్డాడు. 22 ఏస్‌లు సంధించిన సిట్సిపాస్ సెమీస్‌లో నడాల్‌తో తలపడాల్సి ఉంది. మహిళల సింగిల్స్‌లో పెట్రా క్విటోవా 6-1, 6-4తో బర్టీపై, డానిలీ రోస్ కొలిన్స్ (అమెరికా) 2-6, 7-5, 6-1తో అనస్తాసియా (రష్యా)పై గెలుపొంది సెమీస్‌కు చేరుకున్నారు.