Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యక్తిగత దూషణ ఫలితం
దుబాయ్ : విండీస్ యువ క్రికెటర్ షినోన్ గాబ్రియల్‌పై ఐసీసీ కొరడా ఝులిపించింది. క్రమశిక్షణ నియామవళిని అతిక్రమించినందుకు నాలుగు మ్యాచుల నిషేధం విధించింది. ఇంగ్లాండ్‌తో మూడో టెస్టులో ఇంగ్లీష్ జట్టు సారథి జో రూట్‌ను ఉద్దేశించి గాబ్రియల్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ' నీకు అబ్బాయిలు ఇష్టమా? అయితే దాన్నేమీ అవమానంగా భావించకు, గే గా ఉండటం తప్పేమీ కాదు' అంటూ స్వలింగ సంపర్క వ్యాఖ్యలు చేశాడు. గాబ్రియల్ వ్యాఖ్యలు స్టంప్ మైక్‌లో స్పష్టంగా వినిపించాయి. మ్యాచ్ రిఫరీ వద్ద తప్పును అంగీకరించిన గాబ్రియల్‌కు ఐసీసీ నాలుగు వన్డేల నిషేధం విధించింది.