Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేషనల్ చాంప్ సౌరభ్ వర్మ
న్యూఢిల్లీ : బ్యాడ్మింటన్ సీనియర్ నేషనల్ చాంపియన్ సౌరభ్ వర్మ తనకు మరిన్ని నిధులు కావాలని బ్యాడ్మింటన్ ఆసోసియేషన్ ఆఫ్ ఇండియా (బారు)ని అభ్యర్థించాడు. ఇటీవల గువహటిలో ముగిసిన 83వ సీనియర్ జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో మెన్స్ సింగిల్స్ చాంపియన్‌గా వర్మ నిలిచాడు. సౌరభ్ 2011లోనే నేషనల్ చాంపియన్‌గా నిలిచినా, గాయాలతో నిలకడగా విజయాలు సాధించలేదు. ఇది వర్మ ప్రపంచ ర్యాంకింగ్‌పై ప్రభావం చూపించింది. బీడ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో వర్మ ప్రస్తుతం 55వ స్థానంలో కొనసాగుతున్నాడు. ' అంతర్జాతీయ టోర్నీలు ఆడేందుకు నాకు సరైన ఆర్థిక సహకారం లేదు. కొత్త నిబంధనల ప్రకారం టాప్-25 ర్యాంకర్లకు మాత్రమే బారు నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. నిధుల లేమితో వీలైనన్ని అంతర్జాతీయ టోర్నీల్లో ఆడలేకపోతున్నాను. ఇది అంతిమంగా ర్యాంకింగ్‌పై ప్రభావం చూపుతుంది. దేశవాళీలో రెండు టోర్నీల్లో రాణించాను. దీంతో డచ్ ఓపెన్‌కు బారు సహకారం అందించింది. కానీ మరిన్ని నిధులు అందిస్తే, మెరుగైన ప్రదర్శన చేయగలను' అని వర్మ విశ్వాసం వెలిబుచ్చాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన సౌరభ్ వర్మకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచీ సరైన సహకారం లభించలేదు!.