Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పదోస్థానంలో సెరెనా విలియమ్స్
- డబ్ల్యూటీఏ ర్యాంకింగ్ విడుదల
వాషింగ్టన్: అమెరికా టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ డబ్ల్యూటీఏ ర్యాంకింగ్‌లో టాప్‌టెన్‌లో చోటుదక్కింది. 17 నెలల తర్వాత ఆమె ఈ జాబితాలోకెక్కింది. 2017 సెప్టెంబర్ నెలలో సెరెనా బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఎన్నడూ టాప్..10లో స్థానం సంపాదించలేదు. ఆస్ట్రేలియా ఓపెన్ ప్రారంభానికి ముందు సెరెనా 16 వ స్థానంలో ఉండేది. వరుసగా తన స్థానాన్ని సుస్థిరపర్చుకుంటూ మెరుగైన ర్యాంకు సాధించింది.
2017లో ఆస్ట్రేలియా ఓపెన్‌లో సెరెనా విన్నింగ్
1. మాజీ వరల్డ్ నంబర్.1 రొమెనియా హాలెప్ రెండో స్థానాన్ని దక్కించుకున్నది. ఆస్ట్రేలియా ఓపెన్ కన్నా ముందు రెండో స్థానంలో ఉన్నది. ప్రిక్వార్టర్ ఫైనల్లో సెరెనా ఓడించింది. ఆ టోర్నమెంట్ తర్వాత హాలెప్ మూడో స్థానానికి దిగజారింది.
2.23 సార్లు గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్ అయిన సెరెనా 2017 ఆస్ట్రేలియా ఓపెన్‌లో విజేతగా నిలిచింది.ఆ తర్వాత ఆమె ప్రెగెన్సీ దాల్చటంతో..ఆట నుంచి దూరమైంది. అదే ఏడాది సెప్టెంబర్‌లో ఓలంపియా బిడ్డకు జన్మనిచ్చింది.
3.మార్చి 2018లో సెరెనా పెషావర్ జరిగిన టెన్నిస్ టోర్నమెంట్లో పునరాగమనం చేసింది. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ క్వార్టర్ ఫైనల్ లో ఓటమి తర్వాత మరే మ్యాచ్ ఆడలేదు. ఇప్పటిదాకా ఏడు ఆస్ట్రేలియా ఓపెన్,మూడు ఫ్రెంచ్ ఓపెన్,ఏడు వింబుల్డన్, ఎనిమిది యూఎస్ ఓపెన్ కితాబులు ఆమెకు దక్కాయి.
4.ర్యాంకింగ్‌లో జపాన్‌కు చెందిన ఓసాకా మొదటిస్థానాన్ని దక్కించుకున్నది. హాలోప్ తర్వాత అమెరికాకు చెంది స్లోన్ స్టీపెన్స్ మూడో స్థానం, పెట్రో క్వితోవా(చెక్ దేశం) నాలుగో స్థానం,ఐదో స్థానంలో ప్లిస్కోవ్లు ఉన్నారు.