Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యు.ఎస్ ఓపెన్‌లో పునరాగమనం?
హైదరాబాద్ : మూడు నెలల క్రితం సానియా మీర్జాను, ప్రస్తుత సానియా మీర్జాను ఏమాత్రం పోల్చుకోలేం!. ప్రసవానంతరం బాగా బరువు పెరిగిన సానియా మీర్జా.. బిడ్డకు జన్మనిచ్చిన నెల విరామంలోనే జిమ్‌లోకి అడుగుపెట్టింది. రోజుకు ఐదు గంటలకు పైగా జిమ్‌లో కఠోర కసరత్తులు చేస్తోంది. బొద్దుగా తయారైన సానియాను చూసి, ఈ బరువు తగ్గేందుకు కనీసం ఏడాది పడుతుందని వ్యాఖ్యానించిన వారున్నారు. కానీ మూడు నెలల్లోనే సానియా 22 కిలోలు తగ్గింది. 89 కిలోల శరీర బరువును 67 కిలోలకు తగ్గించుకోగల్గింది. ఆస్ట్రేలియా ఒలింపియన్ రాబర్ట్ బల్లార్డ్ పర్యవేక్షణలో ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న సానియా మీర్జా.. ఈ ఏడాది ఆగష్టులో టెన్నిస్ కోర్టులో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. యు.ఎస్ ఓపెన్‌లో గ్రాండ్ ఎంట్రీపై సానియా గురి పెట్టినా.. అంతకముందే టెన్నిస్ కోర్టులో తనను తాను పరీక్షించుకోవాలని సానియా భావిస్తోంది. జిమ్‌లో కసరత్తులు చేస్తున్న ఫోటోలను సానియా సోషల్ మీడియాలో ఉంచింది. సానియా అంకితభావానికి అభిమానులు ఫిదా అయిపోతున్నారు!.