Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్‌కత : సరిగ్గా ఏడాది తర్వాత గృహ హింస వేధింపుల కేసు మళ్లీ షమి మెడకు చుట్టుకుంటోంది. నిరుడు ఐపీఎల్ ఆరంభానికి ముందు షమితో దూరంగా ఉంటోన్న భార్య హసిన్ జహన్ తన భర్తపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఏడాది తర్వాత కోల్‌కత పోలీసు మహిళా ఫిర్యాదుల విభాగం మహ్మద్ షమిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఐపీసీ సెక్షన్ 498ఏ, 354ఏ కింద షమి సహా అతడి సోదరుడు హసిబ్ అహ్మద్‌పై కేసు నమోదు చేశారు. సెక్షన్ 307 హత్యాయత్నం, సెక్షన్ 376 హత్యాచార శిక్ష నేరాలను పోలీసులు తొలగించారు. షమి కుటుంబ సభ్యుల పేర్లను సైతం ఎఫ్ఐఆర్ నుంచి తొలగించారు. అలిపోర్ ఏసీజెఎం కోర్టుకు పోలీసులు గురువారం తుది చార్జిషిట్ దాఖలు చేశారు.