Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్‌కత : భారత మాజీ కెప్టెన్, క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ మళ్లీ ఐపీఎల్‌లోకి అడుగుపెడుతున్నాడు. 2013లో పుణె వారియర్స్ తరఫున గంగూలీ ఐపీఎల్‌తో సంబంధాలు ముగించుకున్నాడు. ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ సలహాదారుగా గంగూలీ నిమితులయ్యారు. డిసీలో దాదా పాత్ర ఏ విధంగా ఉంటుందనే విషయం వెల్లడి కాలేదు. ' సలహాదారు నియామకంలో ఎటువంటి విరుద్ధ ప్రయోజనాలు లేవు. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌కు రాజీనామా చేశాను. ఒప్పుకునే ముందు పాలకుల కమిటీతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నాను' అని గంగూలీ వెల్లడించాడు.