Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాకు : భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ వాల్ట్ ఫైనల్లోకి ప్రవేశించింది. అజర్‌బైజాన్‌లోని బాకులో జరుగుతున్న ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ వరల్డ్‌కప్‌లో దీప టైటిల్ ప్రదర్శనకు సిద్ధమైంది. గురువారం జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్లో దీప మూడో స్థానంలో నిలిచింది. వరుసగా 14.466, 14.133 పాయింట్లతో వాల్ట్‌లో సగటు 14.299 పాయింట్లు సాధించింది. అర్హత రౌండ్లలో తొలి ఎనిమిది స్థానాల్లో నిలిచిన వారు ఫైనల్స్‌కు వెళతారు. వాల్ట్ ఫైనల్స్ శనివారం జరుగనున్నాయి. శుక్రవారం జరిగే బ్యాలెన్స్డ్ బీమ్ విభాగంలోనూ దీప పోటీపడనున్నది.