Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ధనాధన్ క్రికెట్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. మరో ఆరు రోజుల్లో అభిమానులకు ఉర్రూతలూగించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రంగం సిద్ధం చేసుకున్నది. ప్రపంచకప్ ముంగిట జరుగుతున్న సీజన్‌పై అందరి దృష్టి పడింది. ప్రపంచ క్రికెట్లో అత్యంత విలువైన బ్రాండ్ క్రికెట్ ఐపీఎల్ వంద శాతం వినోదానికి రెఢ అయిపోయింది. మార్చి 23న చెపాక్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ ఢతోీ లీగ్ ఆరంభం కానున్నది.
నవతెలంగాణ క్రీడావిభాగం
బౌలింగే బలం : 2013 నుంచీ సన్‌రైజర్స్ వజ్రాయుధం బౌలర్లు. తాజా సీజన్లోనూ ఆరెంజ్ ఆర్మీ ప్రధాన ఆయుధం విషయంలో ఎటువంటి మార్పు లేదు. స్వింగ్‌స్టర్ భువనేశ్వర్ కుమార్, అష్ఘాన్ స్పిన్ గన్ రషీద్ ఖాన్లు సన్‌రైజర్స్ బౌలింగ్ విభాగానికి సారథ్యం వహిస్తున్నారు. గత సీజన్ల మాదిరిగానే ఇప్పుడూ ప్రత్యర్థి జట్లను స్వల్ప స్కోర్లకు పరిమితం చేయటంలో వీరి పాత్ర కీలకం. వీరిద్దరూ బ్యాట్‌తోనూ సత్తా చాటగలరు. దీంతో ఇద్దరు ఆల్‌రౌండర్ల బలం అదనపు ప్రయోజనం. మరో అష్ఘాన్ స్పిన్నర్ మహ్మద్ నబీ, ఆసీస్ సీమర్ బిల్లీ స్టాన్లెక్, ఖలీల్ అహ్మద్ సహా బంగ్లా ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్‌లతో కూడిన సన్‌రైజర్స్ బౌలింగ్ విభాగం పటిష్టంగా కనిపిస్తోంది.
బ్యాట్‌తోనూ బలమైన జట్టే : సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ శిఖర్ ధావన్ సేవలను కోల్పోవటం ప్రతికూలం. కానీ అతడి స్థానంలో ఇంగ్లాండ్ ఆటగాడు జానీ బెయిర్‌స్టోను హైదరాబాద్ ఎంచుకున్నది. న్యూజిలాండ్ వెటరన్ మార్టిన్ గప్టిల్ సైతం కొత్తగా జట్టులోకి వచ్చాడు. టాప్ ఆర్డర్లో డెవిడ్ వార్నర్ చేరిక సన్‌రైజర్స్‌కు కొండంత బలం. 2016లో ఒంటిచేత్తో బ్యాటింగ్ భారం మోసిన వార్నర్‌కు ఈ సారి కెప్టెన్ కానె విలియమ్సన్ సహా దీపక్ హుడా, మనీశ్ పాండే, యూసుఫ్ పఠాన్లు తోడు కానున్నారు. సంప్రదాయబద్దమైన షాట్లతో టీ20 ఫార్మాట్లో రాణించగలమని నిరూపించిన ఆటగాడు విలియమ్సన్. ఆల్‌రౌండర్ విజరు శంకర్ చేరిక సన్‌రైజర్స్‌కు రెండు విధాల ప్రయోజనం.
తుది జట్టు ఎలా? : సన్‌రైజర్స్‌కు డెవిడ్ వార్నర్, కానె విలియమ్సన్, మార్టిన్ గప్టిల్, రషీద్ ఖాన్, మహ్మద్ నబీ, జానీ బెయిర్‌స్టో, బిల్లీ స్టాన్లెక్ రూపంలో విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. గరిష్టంగా నలుగురు మాత్రమే తుది జట్టులో ఆడేందుకు అవకాశం ఉన్నది. విలువైన దేశవాళీ ఆటగాళ్లను వదులుకున్న సన్‌రైజర్స్.. విదేశీ ఆటగాళ్లతో ఆ స్థానాలను ఏ విధంగా భర్తీ చేస్తుందనేది ఆసక్తికరం. వార్నర్, విలిమయ్సన్, రషీద్ ఖాన్, షకిబ్‌లు ఇప్పటివరకూ తుది జట్టులో ఆడుతూ వచ్చారు. ఇప్పుడు ధావన్ స్థానంలో గప్టిల్‌ను ఆడించే ఆలోచన ఉంది. అందుకోసం ఎవరిని బెంచ్‌పై కూర్చోబెడతారనేది ఆసక్తికరం.
జట్టు: సన్‌రైజర్స్ హైదరాబాద్
కెప్టెన్ : కానె విలియమ్సన్
యజమాని :కళానిధి మారన్ (సన్ టీవీ నెట్వర్క్)
జట్టు : కానె విలియమ్సన్, డెవిడ్ వార్నర్, మనీశ్ పాండే, మార్టిన్ గప్టిల్, రికీ భురు, శ్రీవాట్స్ గోస్వామి, వృద్దిమాన్ సాహా, జానీ బెయిరిస్టో, దీపక్ హుడా, విజరు శంకర్, యూసుఫ్ పఠాన్, రషీద్ ఖాన్, అభిషేక్ శర్మ, మహ్మద్ నబి, షకిబ్ అల్ హసన్, భువనేశ్వర్ కుమార్, బిల్లీ స్టాన్లెక్, టి. నటరాజన్, ఖలీల్ అహ్మద్, సిద్దార్థ్ కౌల్, బసిన్ తంపీ, సందీప్ శర్మ.
గత ప్రదర్శన
2016 విజేత, 2018 రన్నరప్ అంచనా ప్లే ఆఫ్స్‌కు చేరుకునే జట్లలో ఒకటి. టైటిల్ పోరుకు బలమైన పోటీదార.
2016 విజేత. 2017 ప్లే ఆఫ్స్, 2018 రన్నరప్. గత మూడు సీజన్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జోరు ఇది. అత్యంత నిలకడగా రాణిస్తోన్న జట్లలో ఆరెంజ్ ఆర్మీ సైతం చేరిపోయింది. స్టార్ బ్యాట్స్‌మెన్, విధ్వంసకారుడు డెవిడ్ వార్నర్ ఈ సీజన్లో తిరిగి హైదరాబాద్‌కు వస్తున్నాడు. గత సీజన్లో ఫైనల్స్ వరకూ వెళ్లిన సన్‌రైజర్స్.. వార్నర్ రాకతో కప్పు వరకూ చేరుతుందా?