Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్
దుబాయ్ : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత స్టార్స్ అగ్రస్థానాల్లో కొనసాగుతున్నారు. బ్యాటింగ్ మ్యాస్ట్రో విరాట్ కోహ్లి, బౌలింగ్ హీరో జశ్‌ప్రీత్ బుమ్రా వరల్డ్ నం.1 స్థానాలు నిలుపుకున్నారు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను భారత్ కోల్పోయినా.. వ్యక్తిగత ప్రదర్శనలతో మెరిసిన విరాట్, బుమ్రా అగ్రస్థానాల్లో ఉన్నారు. ఆసీస్‌పై 310 పరుగులు చేసిన కోహ్లి ప్రథమ స్థానంలో ఉండగా, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ 202 పరుగులు చేసిన వరల్డ్ నం.2గా కొనసాగుతున్నాడు. కేదార్ జాదవ్ 11 స్థానాలు ఎగబాకి కెరీర్ అత్యుత్తమ 24వ స్థానం సాధించాడు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ రాస్ టేలర్ మూడో స్థానంలో ఉన్నాడు. బుమ్రా 774 రేటింగ్ పాయింట్లతో బౌలర్ల జాబితాలో ముందున్నాడు. ట్రెంట్ బౌల్ట్ రెండో స్థానంలో, రషీద్ ఖాన్ మూడో స్థానంలో, ఇమ్రాన్ తాహీర్ నాల్గో స్థానాల్లో ఉన్నారు. ఆల్ రౌండర్ల జాబితాలో రషీద్ ఖాన్ ముందున్నాడు.