Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నం.4 స్థానంపై గంగూలీ
న్యూఢిల్లీ : ప్రపంచకప్‌లో భారత జట్టు నం.4 బ్యాట్స్‌మన్ ఎవరనే చర్చ కొనసాగుతూనే ఉన్నది. విజరు శంకర్, రిషబ్ పంత్‌లను కొందరు సూచించగా పంత్, పుజారా, రహానె అని కొందరు అంటున్నారు. ఐపీఎల్ 12 సీజన్ నం.4 స్థానానికి సమాధానం చెబుతుందని మాజీ కెప్టెన్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ' నం.4కు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ ఐపీఎల్ ఆ ప్రశ్నకు సమాధానం చెబుతుందని అనుకుంటున్నా. నా కెప్టెన్సీలో నం.4లో రాహుల్ ద్రవిడ్ ఆడేవాడు. పుజార మంచి ఫామ్‌లో ఉన్నాడు. ప్రయోగమే చేయాలని అనుకుంటే, అతడితో చేయటం మేలని చెప్పాను. దీనిపై మన అభిప్రాయం చెప్పవచ్చు. కానీ నం.4 ఎవరైతే బాగుంటుందో కెప్టెన్ కోహ్లికి తెలుసు' అని గంగూలీ అన్నాడు. విరాట్ కోహ్లి వంటి ఆటగాడు ఏ స్థానంలో వచ్చినా పరుగులు చేయగలడు. కానీ అతడు మూడో స్థానంలో ఆడాలనేది నా అభిప్రాయం. చాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఓడుతుందని ఎవరూ ఊహించలేదు. ప్రపంచకప్ కోహ్లిసేన నెగ్గుతుందని విశ్వసిస్తున్నాను. టీమ్ ఇండియా ఫేవరెట్ అని ఈ మాట చెప్పట్లేదు. ఈ జట్టుకు ఎక్కువ బలహీనతలు లేవు. రోహిత్, ధోని, కోహ్లి, బుమ్రా, ధావన్, బుమ్రాలు భారత్‌ను విజేతగా నిలుపగలరు అని దాదా అభిప్రాయ పడ్డాడు.