Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐపీఎల్లో స్టార్ ఇండియా కొత్త రికార్డు
న్యూఢిల్లీ : రెండేండ్ల క్రితం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గ్లోబల్ ప్రసార హక్కులను స్టార్ ఇండియా రూ. 16,347 కోట్లకు దక్కించుకున్నప్పుడు అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తొలి పది సీజన్లకు సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఈ మొత్తంలో సగానికి కంటే తక్కువ ధరకే ప్రసార హక్కులు దక్కించుకున్నది. దీంతో స్టార్ ఇండియా మరీ ఎక్కువ బిడ్ చేసిందనే అభిప్రాయం వినిపించింది. కానీ మార్కెటింగ్ వ్యూహంతో స్టార్ ఇండియా కొత్త పుంతలు తొక్కింది. ఈ ఏడాది ఐపీఎల్లో కేవలం ప్రకటనల అమ్మకంలోనే రూ. 2000-2100 కోట్లు మార్కెట్ ఏర్పరచుకున్నది. 2008లో ప్రకటనల అమ్మకంతో రూ. 300 కోట్ల ఆదాయం లభించగా, 12 సీజన్‌కు అది రూ. 2000 మార్క్‌ను దాటేసింది. టెలివిజన్, డిజిటల్ ప్రకటనలను వేర్వేరుగా చేసి స్టార్ ఇండియా అమ్మకాలు చేపట్టింది. సహ సమర్పణ స్పాన్సర్ రూ. 100 కోట్లు, అసోసియేట్ స్పాన్సర్ రూ. 70 కోట్లుగా ఉన్నట్టు సమాచారం. డిజిటల్ మీడియాలో (హాట్‌స్టార్)లో ఇదే ధరలు రూ. 25 కోట్లు, రూ. 15 కోట్లు ఉన్నాయి. డిజిటల్లో డ్రీమ్11, అమెజాన్ పే, కోకాకోలా, స్విగ్గీలు సహ సమర్పణ స్పాన్సర్లుగా ఉన్నాయి. మారుతి సుజికి, మాగీ (నెష్లె), ఫ్లిప్‌కార్ట్‌లు అసోసియేట్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నాయి. ఇక టెలివిజన్‌లో పోన్‌పే, ఒప్పో, థమ్స్అప్, వివోలు ప్రధాన స్పాన్సర్ కాగా.. ఏషియన్ పెయింట్స్, మారుతి సుజికి, స్విగ్గీ, బిగ్ బజార్, డైరీ మిల్క్, విమల్, డ్రీమ్ 11, మేక్ మై ట్రిప్, వోల్టాస్, ఎంఆర్ఎఫ్, బైజూస్, పాలీక్యాబ్, మొబైల్ ప్రీమియర్ లీగ్, శాంసంగ్‌లు అసోసియేట్ స్పాన్సర్ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.