Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుబాయ్ : క్రికెట్లో అవినీతి, మ్యాచ్ ఫిక్సింగ్పై ఉక్కుపాదం మోపే దిశగా అంతర్జాతీయ క్రికెట్ సంఘం (ఐసీసీ) మరో అడుగు ముందుకేసింది. ప్రపంచ వ్యాప్తంగా పోలీసు వ్యవస్థతో సహకారాన్ని అందించే ఇంటర్‌పోల్‌తో ఐసీసీ జోడీ కట్టింది. ' కలిసి పని చేసేందుకు ఐసీసీ, ఇంటర్‌పోల్ ఆసక్తిగా ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ వ్యవస్థలతో ఐసీసీకి చాలా దేశాల్లో మంచి సంబంధాలు ఉన్నాయి. కానీ ఇంటర్‌పోల్‌తో భాగ స్వామ్యంతో 194 దేశాలతో సంబం ధాలు ఏర్పడుతాయి. ఫిక్సింగ్పై ఆటగాళ్లకు నిరంతర అవగాహన కల్పిస్తూనే, క్రీడా సమగ్రతను దెబ్బతీస్తూ భారీ లాభాలు ఆశిస్తోన్న ఫిక్సర్లు, బుకీల భరతం పట్టేందుకు చేతులు కలుపుతున్నాం' అని ఐసీసీ అవినీతి నిరోధక విభాగం జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ తెలిపారు.