Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఫిరోజ్‌షా కోట్లా వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఓటమి చవిచూసింది. ఈ ఓటమిపై స్పందించిన ఢిల్లీ ప్రధాన కోచ్ రికీపాంటింగ్ క్యూరేటర్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంత చెత్త పిచ్ మరెక్కడా ఉండదని మండిపడ్డాడు. 'ఈ వికెట్ చాలా విచిత్రంగా ఉంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో పిచ్ స్పందిస్తున్న తీరు చూసి ఆశ్చర్యానికి గురయ్యాం. మ్యాచ్‌కు ముందు పిచ్ క్యూరేటర్‌తో మాట్లాడితే.. ఇదే మంచి పిచ్ అని చెప్పాడు. కానీ తర్వాత తెలిసింది. ఇది చెత్త పిచ్లోకెళ్ల చెత్త పిచ్' అంటూ పాంటింగ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.