Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోల్‌కతాపై భారీస్కోర్ నమోదు
బెంగళూరు: వరుస పరాజయాలతో విలవిల్లాడుతున్న బెంగళూరుజట్టు కోల్‌కతాపై ఊరటనిచ్చే ప్రదర్శన చేసింది. బ్యాటింగ్‌లో ఇప్పటి వరకు విఫలమవుతూ వస్తున్న ఆ జట్టు కెప్టెన్, ఏబీ డివిలియర్స్‌లు చెలరేగి ఆడారు. ముఖ్యంగా ఇప్పటి వరకు సరైన ప్రదర్శన కనబరచని కెప్టెన్ కోహ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు ప్రారంభం నుంచే బ్యాట్‌కు పనిచెప్పింది. జట్టు స్కోర్ 64 పరుగుల వద్ద ఓపెనర్ పార్థివ్ పటేల్ (25) అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన డివిలియర్స్ అండగా కోహ్లీ చెలరేగిపోయాడు. ఇద్దరూ కలిసి కోల్‌కతా బౌలర్లకు చుక్కలు చూపించారు. ఇద్దరూ కలిసి 55 బంతుల్లో 108 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ క్రమంలో కోహ్లీ, డివిలియర్స్ ఇద్దరూ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 18వ ఓవర్ తొలి బంతికి దూకుడుగా ఆడిన కోహ్లీ.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 49 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 84 పరుగులు చేశాడు. ఇక ఆకాశమే హద్దుగా చెలరేగిన డివిలియర్స్ 32 బంతుల్లో 5 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. 16 ఓవర్లకు వికెట్ నష్టపోయి 153 పరుగులు చేసిన బెంగళూరు చివరి 24 బంతుల్లో 52 పరుగులు చేసింది. ఏబీ డివిలియర్స్ (51; 28 బంతుల్లో 5×4, 3×6) కోల్‌కతా బౌలింగ్‌ను ఊచకోత కోశాడు. 28 బంతుల్లోనే అర్ధశతకం బాదేశాడు. మూడు భారీ సిక్సర్లతో సత్తా చాటాడు. చివర్లో మార్కస్ స్టోయినిస్ 13 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 28 పరుగులు చేశాడు. దీంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసి కోల్‌కతాకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఎట్టకేలకు కోహ్లి ఫామ్‌లోకి..
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చాడు. ఈ ఐపీఎల్లో ఆశించినస్థాయిలో రాణించలేకపోయిన కోహ్లీ నేటి మ్యాచ్‌లో 84 పరుగులతో సత్తా చాటాడు. అర్ధసెంచరీని 31 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో పూర్తిచేశాడు. ఈ ఐపిఎల్‌లో కోహ్లికి ఇదే తొలి అర్ధసెంచరీ. 49 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేశాడు. చివరకు కుల్దీప్ బౌలింగ్‌లో అతనికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవీలియన్‌కు చేరాడు.
డివిలియర్స్ ఊచకోత...
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు ఆటగాడు డివిలియర్స్ కూడా అర్ధ సెంచరీ చేశాడు. కేవలం 28 బంతుల్లో 5 పోర్లు, 3 సిక్సర్లతో అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. మరోవైపు కోహ్లీ కూడా కోల్‌కతా బౌలర్లకు చుక్కలు చూపించాడు. సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడి మునుపటి ఫామ్‌లోకి వచ్చాడు. నరైన్, కుల్దీప్, రాణాలకు తలా ఒక వికెట్ దక్కాయి.
స్కోర్‌బోర్డు...
బెంగళూరు ఇన్నింగ్స్ : పార్దీవ్ పటేల్ (ఎల్బి) నితీష్ రాణా 25, కోహ్లీ (సి అండ్ బి) కుల్దీప్ 84, డివిలియర్స్ (సి) శుభ్‌మన్ గిల్ (బి) నరైన్ 63, స్టొయినిస్ (నాటౌట్) 28, మొయిన్ అలీ (నాటౌట్) 0, అదనం 5. (20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 205 పరుగులు)
వికెట్ల పతనం : 1/64, 2/172, 3/185
బౌలింగ్ : ప్రసిధ్ 3-0-41-0, పియూష్ చావ్లా 4-0-32-0, నరైన్ 4-0-30-1, ఫెర్గ్యుసన్ 2-0-32-0, కుల్దీప్ 4-0-31-1, నితీష్ రాణా 2-0-22-1, రసెల్ 1-0-16-0.