Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఆదుకున్న పొలార్డ్
-ముంబయి 136/7
నవతెలంగాణ-హైదరాబాద్
సొంతగడ్డపై సన్‌రైజర్స్ బౌలర్లు మరోసారి రెచ్చిపోయారు. ప్రమాదకర ముంబయి ఇండియన్స్‌ను స్వల్ప స్కోరుకే పరిమితం చేశారు. బౌలర్ల మెరుపులతో ముంబయి బ్యాటింగ్ లైనప్ పరుగులు చేసేందుకు ఇబ్బంది పడింది. కెప్టెన్ రోహిత్ శర్మ (11), సూర్యకుమార్ యాదవ్ (7), క్వింటన్ డికాక్ (19), కృనాల్ పాండ్య (6), హార్దిక్ పాండ్య (14) విఫలమయ్యారు. చివరి రెండు ఓవర్లలో 39 పరుగులు పిండుకున్న కీరన్ పొలార్డ్ (46 నాటౌట్, 26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) ముంబయికి గౌరవ ప్రద స్కోరు అందించాడు. పొలార్డ్ మెరుపులతో ముంబయి ఏడు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేయగల్గింది.
పొలార్డ్ మెరుపులు : టాస్ నెగ్గిన హైదరాబాద్ ఛేదనకు మొగ్గు చూపింది. చెన్నైపై విజయంతో ఉత్సాహంగా ఉన్న ముంబయి భారీ స్కోరు సాధించటం ఖాయమే అనిపించింది. కానీ సన్‌రైజర్స్ బౌలర్ల ముందు ముంబయి బ్యాటింగ్ లైనప్ విలవిల్లాడింది. పరుగుల కోసం చెమటోడ్చాల్సి వచ్చింది. ఓపెనర్లు మరోసారి ముంబయిని నిరాశపరిచారు. కెప్టెన్ రోహిత్ శర్మ (11, 14 బంతుల్లో 1 సిక్సర్) ఓ సిక్సర్‌తో మెరిసినా.. స్పిన్నర్ నబి ఓవర్లో వికెట్ కోల్పోయాడు. మూడో స్థానంలో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (7) సందీప్ శర్మకు వికెట్ల ముందు దొరికిపోయాడు. మరో ఓపెనర్ క్వింటన్ డికాక్ (19) సైతం ఓ ఫోర్, సిక్సర్‌తో దూకుడుగా ఆరంభించినా.. నిలకడ చూపలేదు. 43/3తో ముంబయి ఇన్నింగ్స్ చప్పగా మొదలైంది. మిడిల్ ఆర్డర్ సైతం ముంబయికి మెరుగైన ప్రదర్శన చేయలేదు. ఇషాన్ కిషన్ఖ (17), కృనాల్ పాండ్య (6), హార్దిక్ పాండ్య (14), రాహుల్ చాహర్ (10)లు అలా వచ్చి, ఇలా ఓ బౌండరీ కొట్టి.. డగౌట్‌కు చేరుకున్నారు. ఆరంభంలోనే ఓ జీవనదానం పొందిన కీరన్ పొలార్డ్ చివరి రెండు ఓవర్లలో రెచ్చిపోయాడు. 26 బంతుల్లో నాలుగు సిక్సర్లు, రెండు ఫోర్లతో 46 పరుగులు పిండుకున్నాడు. పొలార్డ్ చివరి మెరుపులతో ముంబయి ఇండియన్స్ 136 పరుగులు చేసింది. సన్ సారథి భువనేశ్వర్ కుమార్ చివరి ఓవర్లో 19 పరుగులు ఇచ్చుకున్నాడు. సన్ బౌలర్లలో సిద్దార్థ్ కౌల్ రెండు వికెట్లు తీసుకోగా.. భువి, సందీప్, నబి, రషీద్‌లు తలా ఓ వికెట్ పడగొట్టారు.