Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పృథ్వీ షా అసంతృప్తి
బెంగళూర్ : ఐపీఎల్12 ఆరంభం నుంచి పిచ్‌లపై విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. చెన్నై, బెంగళూర్ తలపడిన చెపాక్ పిచ్ ఊహికందని నెమ్మదిగా స్పందించింది. ఆ మ్యాచ్‌లో సూపర్ కింగ్స్ నెగ్గినా.. కెప్టెన్ ధోని పిచ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. స్లో వికెట్‌పై కోహ్లి సైతం ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌కు ఫిరోజ్ షా కోట్ల నెమ్మదైన వికెట్‌ను అందించటంపై ఢిల్లీ క్యాపిటల్స్ చీఫ్ కోచ్ రికీ పాంటింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ జట్టు యువ ఆటగాడు పృథ్వీ షా సైతం పిచ్‌పై విమర్శలు చేశాడు. అంచనాలను అందుకునేలా పిచ్‌లు ఉండటం లేదని షా పేర్కొన్నాడు. ' అవును పిచ్‌లు అంచనాలను అందుకోవటం లేదు. ఆరంభ ఓవర్లలో బంతి నెమ్మదిగా కదులుతోంది. తొలి ఓవర్ నుంచే బంతి టర్న్ అవుతోంది. అయినా, ఈ విషయాలను పక్కనపెట్టి తర్వాత మ్యాచ్‌పైనే దృష్టి పెట్టామని ' షా అన్నాడు. ఫిరోజ్ షా కోట్ల పిచ్‌పై పృథ్వీ షా కోల్‌కత నైట్‌రైడర్స్‌పై 99 పరుగుల ఇన్నింగ్స్ నమోదు చేసిన సంగతి తెలిసిందే.