Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజస్థాన్‌పై ఏకపక్ష విజయం
- చెలరేగిన లిన్, నరైన్
జైపూర్ : కోల్‌కత నైట్‌రైడర్స్‌కు ఎదురులేదు!. కెకెఆర్ ప్రతాపానికి రాజస్థాన్ రాయల్స్ బలైంది!. స్టీవ్ స్మిత్ (73 నాటౌట్, 59 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్ధ సెంచరీతో తొలుత రాయల్స్ 139/3 పరుగులు చేసింది. ఛేదనలో కోల్‌కత ఓపెనర్లు చెలరేగారు. క్రిస్ లిన్ (50, 32 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), సునీల్ నరైన్ (47, 25 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) విధ్వంసక ఇన్నింగ్స్‌లో విజృంభించారు. వీరిద్దరి మెరుపులతో కోల్‌కత 13.5 ఓవర్లలోనే 8 వికెట్ల తేడాతో ఏకపక్ష విజయం సాధించింది.
లిన్, నరైన్ విధ్వంసం : రాయల్స్ చెమటోడ్చిన సాధించిన 139 పరుగులను కోల్‌కత ఉఫ్‌మని ఊదేసింది. బౌలర్లకు అనుకూలించిన పిచ్‌పై కోల్‌కత ఓపెనర్లు క్రిస్ లిన్, నరైన్‌లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఓపెనింగ్ జోడీ మూడేసి సిక్సర్లు, ఆరు ఫోర్లతో విరుచుకుపడింది. విధ్వంసక ఇన్నింగ్స్‌లతో పది ఓవర్లలోనే మ్యాచ్ కోల్‌కత పక్షమైంది. అర్ధ సెంచరీ తర్వాత లిన్, ఫిఫ్టీకి ముందు నరైన్ అవుటైనా.. కోల్‌కత జోరు తగ్గలేదు. రాబిన్ ఉతప్ప (26 నాటౌట్), శుభ్‌మన్ గిల్ (6 నాటౌట్)లు లాంఛనాన్ని ముగించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ సొంతగడ్డపై స్వల్ప స్కోరుకే పరిమితమైంది. కెప్టెన్ అజింక్య రహానె (5) విఫలమయ్యాడు. ఓ ఫోర్ కొట్టిన రహానె, ప్రసిద్ బంతికి ఎల్బీగా అవుటయ్యాడు. మరో ఓపెనర్ జోశ్ బట్లర్ (37)తో కలిసి స్మిత్ (73) రెండో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నమోదు చేశాడు. బట్లర్ ఐదు ఫోర్లు, ఓ సిక్సర్‌తో మెరిశాడు. కోల్‌కత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయటంతో పరుగులు రావటం కష్టమైంది. అరంగేట్ర బౌలర్ గుర్నె వరుసగా బట్లర్, త్రిపాఠి (6)లను అవుట్ చేశాడు. బెన్ స్టోక్స్ (7) వేగంగా ఆడలేకపోయాడు. స్మిత్ సైతం అర్ధ సెంచరీ బాదినా, ధనాధన్ షాట్లు ఆడలేదు. చివరి ఓవర్లలో స్మిత్, స్టోక్స్ క్రీజులో నిలిచినా రాయల్స్‌కు భారీ స్కోరు దక్కలేదు.