Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐపీఎల్ బీమా వివాదం
మెల్బోర్న్ : ఆస్ట్రేలియా ప్రధాన సీమర్ మిచెల్ స్టార్క్ న్యాయ పోరాటానికి సిద్ధమయ్యాడు. ఐపీఎల్‌కు సంబంధించిన బీమా వివాదంపై స్టార్క్ కోర్టు మెట్లెక్కాడు. ఈ మేరకు ఆస్ట్రేలియా మీడియా కథనం ప్రచురించింది. 2018 ఐపీఎల్లో గాయం కారణంగా స్టార్క్ పాల్గొనలేదు. కోల్‌కత నైట్‌రైడర్స్ తరఫున ఆడాల్సిన స్టార్క్ గత సీజన్‌కు పూర్తిగా దూరమయ్యాడు. ఈ ఏడాది కోల్‌కత యాజమాన్యం స్టార్క్‌ను వదులుకున్నది. 2018 సీజన్‌కు గాను మిచెల్ స్టార్క్ రూ. 8 కోట్ల బీమా చేయించాడు. గాయం కారణంగా స్టార్క్ అసలు ఐపీఎల్‌లోనే ఆడలేదు. అటువంటి సందర్భంలో ఇక బీమా ఏ విధంగా వర్తింస్తుందని సదరు కంపెనీ వాదిస్తోంది. దీనిపై ఇరు పక్షాల నడుమ చర్చలు సాగినా, ఫలప్రదం కాలేదు. దీంతో రూ. 7.5 కోట్ల బీమా సొమ్ము కోసం స్టార్క్ న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యాడు