Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ఐపిఎల్‌లో అదరగొడు తున్న వెస్టిండీస్ వెటరన్ బ్యాట్స్‌మన్ కీరన్ పొలార్డ్ వన్డే జట్టుకు ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పొలార్డ్ విండీస్ జట్టు తరఫున ఆఖరి వన్డే 2016 అక్టోబర్‌లో ఆడాడు. ఆ తర్వాత ఫామ్‌లేమి, బోర్డుతో విభేదాల కారణంగా ఇప్పటివరకూ వెస్టిండీస్ వన్డే జట్టులో పొలార్డ్‌కు చోటు దక్కలేదు. కానీ త్వరలో ఐసీసీ వన్డే ప్రపంచకప్ జరగనున్న దృష్ట్యా ఫామ్‌లో ఉన్న పొలార్డ్‌కు తుదిజట్టులో చోటు దక్కే అవకాశాలున్నట్లు తెలిసింది. బుధవారం పంజాబ్‌తో మ్యాచ్ సందర్భంగా పొలార్డ్ కేవలం 31 బంతుల్లోనే 83 పరుగులు చేసి ముంబయిను ఒంటిచేత్తో గెలిపించిన సంగతి తెలిసిందే.