Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై :ఎడమచేతివాటం స్పిన్నర్ రవీంద్ర జడేజా రికార్డును నెలకొల్పాడు. రాజస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా జడేజా(2/20) రాణించాడు. దీంతో ఐపిఎల్ అన్ని సీజన్లలో కలిపి 100 వికెట్లను పడగొట్టిన ఎడమచేతి ఆఫ్ స్పినర్గా రికార్డ్ నెలకొల్పాడు. జడేజా 2008లో రాజస్తాన్ తరఫున, ఆ తర్వాత కొచ్చి టస్కర్స్ కేరళ తరఫున ఆడాడు. ఆ తర్వాత 2012 నుంచి చెన్నైకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపిఎల్‌లో ఇప్పటివరకూ 12మంది ఆటగాళ్లు 100కు పైగా వికెట్లను పడగొట్టారు. రవీంద్ర జడేజా 100 వికెట్లు పడగొట్టి క్లబ్లో చేరిన 6వ భారతీయ స్పిన్నర్ కాగా... తొలి ఎడమచేతి వాటం ఆఫ్ స్పిన్నర్ కావడం గమనార్హం.