Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాండ్స్‌కాంబ్, హెజిల్వుడ్ అవుట్
- ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టు
మెల్బోర్న్ : మార్చి 28న, ఏడాది నిషేధం ముగించుకున్న ఆస్ట్రేలియా మాజీ సారథ ద్వయం డెవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్‌లు నేరుగా కంగారూ ప్రపంచకప్ జట్టులోకి వచ్చేశారు. నిషేధం తర్వాత జాతీయ జట్టు తరఫున ఒక్క మ్యాచ్‌లోనూ బరిలోకి దిగని ఈ ఇద్దరినీ సెలక్షన్ కమిటీ వరల్డ్‌కప్‌కు ఎంపిక చేసింది. ఇంగ్లాండ్‌లో జరుగనున్న 2019 ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా 15 మందితో కూడిన జట్టును సోమవారం ప్రకటించింది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ పీటర్ హ్యాండ్స్కాంబ్, సీమర్ జోశ్ హెజిల్వుడ్లపై వేటు వేసిన సెలక్టర్లు.. స్మిత్, వార్నర్‌లకు మార్గం సుగమం చేశారు. భారత్‌తో సిరీస్‌లో ఫామ్‌లోకి వచ్చిన గ్లెన్ మాక్స్వెల్ వరల్డ్‌కప్ జట్టులో నిలిచాడు. అరోన్ ఫించ్ నాయకత్వం వహించనున్నాడు.
ఆస్ట్రేలియా వరల్డ్‌కప్ జట్టు : అరోన్ ఫించ్ (కెప్టెన్), డెవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖవాజ, షాన్ మార్ష్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జై రిచర్డ్సన్, నాథన్ కౌల్టర్‌నైల్, జేసన్ బెహాన్‌డార్ఫ్, ఆడం జంపా, నాథన్ లైయాన్.