Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగేండ్ల నుంచి వన్డేలకు దూరం
- కెప్టెన్సీకి దక్కకపోయినా లసిత్‌కు జట్టులో చోటు
కొలోంబో: శ్రీలంక క్రికెట్ బోర్డు గురువారం సమావేశమై..ఐసీసీ వరల్డ్‌కప్..2019కు 15 మంది సభ్యులున్న జట్టును ప్రకటించింది. ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ స్థానంలో దిముత్ కరుణురత్నేకు కెప్టెన్ పగ్గాలు అప్పగించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..వరుణరత్నే 2015 నుంచి వన్డే టీమ్ నుంచి దూరంగా ఉన్నాడు. ఇపుడు అతని రిటర్న్ ఏకంగా కెప్టెన్రూపంలో దక్కటం శ్రీలంక క్రీడాభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. అతనితో పాటు మిలిండ సిరివర్ధనా, జెఫ్రీ వెండరస్, జీవన్ మెండిస్ జట్టులోకి పునరాగమనం చేశారు. సిరివర్ధనా,వెండర్సన్ తమ చివరి మ్యాచులను 2017.అక్టోబర్ నెలలో ఆడారు. జీవన్ 2015లో జరిగిన వరల్డ్కప్లోఆఫ్ఘనిస్థాన్కు వ్యతిరేకంగా శ్రీలంక ఆడిన జట్టులో ఉన్నాడు.
21 ఏండ్ల అవిష్క ఫర్నాండోకు చోటు
శ్రీలంక టీమ్‌లో కరుణరత్నే కెప్టెన్సీలో దక్షిణ ఆఫ్రికాలో టెస్టు సిరీస్ గెలిచింది.ఆ గెలుపుతో ఉత్సాహంతో ఉన్న అక్కడి క్రికెట్ బోర్డు నాలుగేండ్ల పాటు జట్టుకు దూరంగా ఉన్నా తిరిగి అతనికే కెప్టెన్ బాధ్యతలు అప్పగించింది.
అయితే అప్పటి కెప్టెన్ లసిత్ మలింగ నేతృత్వంలో ఉన్న శ్రీలంక జట్టు దక్షిణాఫ్రికా జట్టు చేతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నది. సూపర్‌ఫోర్ పేరిట జరిగే దేశీయ మ్యాచుల్లో కరుణరత్నే వన్డే మ్యాచుల్లో ఒపెనింగ్ చేసే అవకాశం దక్కింది.దీన్ని అతను చక్కగా వినియోగించుకున్నాడు.
2. ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ తరఫున ఆడుతున్న లసిత్ మలింత..తన కెప్టెన్సీలో 2014 జరిగిన టీ..20 వరల్డ్ కప్‌ను గెలిపించాడు. కానీ అతని కెప్టెన్సీలో శ్రీలంక జట్టు ఆడిన తొమ్మిడి వన్డే మ్యాచుల్లో ఓడింది. అయితే టీమ్‌లో ఉన్న కీలకమైన ఆటగాళ్లతో మంచిసంబంధాల్లేవని క్రీడావిశ్లేషకులు అంటున్నారు. తుషార్ పరేరా,మలింగ మధ్య వివాదాలు రచ్చకెక్కాయి.
3.టీమ్‌లో బ్యాట్మెన్స్ లహరు తిరిమనే, ఆల్‌రౌండర్ మిలిండ సిరివర్ధన్,జీవన్ మెండిస్,లెగ్ స్పిన్నర్ జెఫ్రీ వెండర్సేకు చోటు దక్కింది.21 ఏండ్ల బ్యాట్స్‌మెన్ అవిష్క ఫర్నాడోకు వరల్డ్ కప్ మ్యాచుల్లో స్థానం లభించింది. గాయపడ్డ నువాన్ ప్రదీప్‌కు టీమ్‌లో చోటు దక్కటం విశేషం.
4.శ్రీలంక వికెట్ కీపర్,బ్యాట్స్‌మెన్ నివరోశన్ డిక్వెలా,ఆఫ్ స్పిన్నర్ అకిలా ధనంజరు,ఓపెనర్ ధనుష్క గుణతిల్కే, ఉపుల్ తరంగ,దినేశ్ చండిమల్లకు జట్టులో స్థానం దక్కలేదు. ఐసీసీ మే 23 దాకా గడువు ఇచ్చింది. ఈలోపు జట్టులో సభ్యులను మార్చుకునే అవకాశమిచ్చింది.
శ్రీలంక జట్టు..,
దిముత్ కరుణరత్నే (కెప్టెన్). లసిత్ మలింత
ఎంజెలో మ్యాధ్యుస్, తుఫార్ పరేరా
కుశాల్ పరేరా, ధనంజరు డి సిల్వా
కుశాల్ మెండిస,్ ఉదానా
మిలిండ సిరివర్థనా, అవిష్క ఫర్నాండో
జీవన్ మెండిస్, లడిరు తరిమానే
జెఫ్రీ వెండరసే, నువాన్ ప్రదీప్
సురంగ లక్మల్