Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాండ్యా మెరుపులు
- అమిత్ మిశ్రా రికార్డ్
- 8వేల క్లబ్లో రోహిత్ శర్మ
న్యూఢిల్లీ: తొలి వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యం నిర్మించిన రోహిత్-డికాక్‌ల నిష్క్రమణతో ముంబయి జోరుకు బ్రేక్ పడింది. వీరిద్దరూ ఔటైన అనంతరం కట్టింగ్ స్వల్పస్కోర్తోపాటు, మిడిలార్డర్ నిరాశపర్చడంతో ముంబయి భారీస్కోర్‌పై ఆశలు వదులుకుంది. కానీ చివర్లో హార్దిక్ పాండ్యా(32; 15 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) పుంజుకోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్‌కు 169 పరుగుల లక్ష్యాన్ని ముంబయి నిర్దేశించగల్గింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ముంబయి ఇన్నింగ్స్‌ను రోహిత్ శర్మ-డికాక్‌లు శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 57 పరుగులు జత చేసిన తర్వాత రోహిత్ శర్మ(30) మిశ్రా చేతిలో బౌల్డ్ అయ్యాడు. ఆపై బెన్ కట్టింగ్(2) నిరాశపరచగా, కాసేపటికి డికాక్(35) కూడా రనౌట్ అయ్యాడు. దీంతో ముంబయి 74 పరుగుల వద్ద మూడో వికెట్‌ను నష్టపోయింది. ఇక సూర్యకుమార్ యాదవ్(26) ఫర్వాలేదనిపించగా, కృనాల్ పాండ్యా-హార్దిక్ పాండ్యాలు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఇక్కడ హార్దిక్ 32 పరుగులు చేయగా, కృనాల్ 26 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో అజేయంగా 37 పరుగులు చేశాడు. దాంతో ముంబయి ఇండియన్స్ నిర్ణీత ఓవర్లో ఐదు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. చివరి మూడు ఓవర్లలో ముంబయి ఇండియన్స్ 50 పరుగులు సాధించింది. ఢిల్లీ బౌలర్లలో రబడాకు రెండు, అమిత్ మిశ్రా, అక్షర్ పటేల్‌లు తలో వికెట్ తీశారు.
అమిత్ మిశ్రా రికార్డ్
ఐపీఎల్లో 150 వికెట్లు చేజిక్కించుకున్న తొలి భారతీయ బౌలర్ ఢిల్లీ లెగ్‌స్పిన్నర్ అమిత్ మిశ్రా ఖాతాలో 150 వికెట్లు చేరాయి. దీంతో ఐపీఎల్ చరిత్రలో భారత్ తరఫున 150 వికెట్లు చేజిక్కించుకున్న తొలి బౌలర్‌గా మిశ్రా రికార్డు నెలకొల్పాడు. గురువారం ముంబయి ఇండియన్స్‌తో మ్యాచ్ సందర్భంగా మిశ్రా రోహిత్ శర్మను బౌల్డ్ చేసి ఈ ఫీట్‌ను అందుకున్నాడు. అందరికంటే ముందు లసిత్ మలింగ 115 మ్యాచుల్లో 161 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా.. మిశ్రా ఐపీఎల్లో వివిధ ఫ్రాంచేజీల తరఫున 140 మ్యాచ్‌లు ఆడి ఢిల్లీ తరఫున 150 క్లబ్లో చేరాడు.. పియూష్ చావ్లా 152 మ్యాచుల్లో 146 వికెట్లతో మూడోస్థానంలో కొనసాగుతున్నాడు.
8వేల పరుగుల క్లబ్లో రోహిత్
రోహిత్ శర్మ 30 పరుగులు చేయటంతో..టీ.20లో తన ఖాతాలో 8 వేల పరుగులు వేసుకున్నాడు. ఇంతకు ముందు సురేశ్ రైనా (8216), విరాట్ కోహ్లి (8183) పరుగులు చేశారు. వీరిద్దరి సరసన మూడో బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ రికార్డు కెక్కాడు.
ముంబయి ఇండియన్స్ ఇన్నింగ్స్ : రోహిత్ (బి) మిశ్రా 30, డికాక్ (రనౌట్) రబడ/పంత్ 35, కట్టింగ్ (ఎల్బి) అక్షర్ 2, సూర్యకుమార్ (సి) పంత్ (బి) రబడ 26, కృనాల్ (నాటౌట్) 37, హార్దిక్ (సి) పంత్ (బి) రబడా 32, పొలార్డ్ (నాటౌట్) 0. అదనం 6. (20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు)
వికెట్ల పతనం : 1/57, 2/62, 3/74, 4/104, 5/158.
బౌలింగ్: ఇషాంత్ 3-0-17-0, రబడా 4-0-38-2, మోరీస్ 3-0-39-0, కీమో పాల్ 3-0-37-0, అమిత్ మిశ్రా 3-0-18-1, అక్షర్ పటేల్ 4-0-17-1