Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డోపింగ్‌పై రెజ్లింగ్ సమాఖ్య యోచన
న్యూఢిల్లీ: నూతన గవర్నెన్స్ విధానం, కార్పోరేటికరణతో కొత్త పుంతలు తొక్కుతున్న రెజ్లింగ్ సమాఖ్య.. డోపింగ్ భూతంపైనా మెరుపు అస్త్రాన్ని సంధించేందుకు సిద్ధమవుతోంది. గత ఏడాది భారత రెజ్లర్లు నలుగురు డోపింగ్‌లో పట్టుబట్టారు. ఇది అంతర్జాతీయ వేదికపై అవమానకరమే కాదు, జరిమానా రూపంలో భారీ మొత్తాన్ని సైతం కోల్పోవాల్సి వచ్చింది. డోపింగ్ విషయంలో కఠిన వైఖరి తీసుకునే యోచనలో ఉన్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ).. అనూహ్య నిర్ణయం తీసుకున్నది!. ఇప్పటివరకూ ఏ అథ్లెట్ డోపింగ్‌లో దొరికిపోయినా అతడిపైనే నిషేధం విధిస్తున్నారు. ఇక నుంచి డోపింగ్ నిషేధాన్ని కోచ్‌లు, సహాయక సిబ్బందికీ వర్తించజేయాలని రెజ్లింగ్ సమాఖ్య భావిస్తోంది. ఈ మేరకు ఓ సర్కూలర్‌లో కోచ్‌లు, సహాయక సిబ్బందికి స్పష్టమైన సంకేతాలు పంపించింది. కోచ్‌లు, సహాయక సిబ్బందిని నిషేధం పరిధిలోకి తీసుకొస్తే... డోపింగ్ విషయంలో మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని సమాఖ్య భావన. రెజ్లింగ్ సమాఖ్య నిర్ణయం ఏ మేరకు పని చేస్తుందో చూడాలి.