Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైనామన్ కుల్దీప్ యాదవ్ మాట
కోల్‌కత : మహేంద్రసింగ్ ధోని క్రికెటింగ్ నైపుణ్యం, మ్యాచ్ పరిస్థితులను చదివేసే సామర్థ్యంపై ప్రపంచ క్రికెట్లో ఎవరికీ అనుమానం లేదు. మ్యాచ్ పరిస్థితులను గొప్పగా అర్థం చేసుకునే ధోని.. క్రీజులో కుదురుకున్న బ్యాట్స్‌మన్‌ను వలలో వేసేందుకు అవ సరమైన చిట్కాలను బౌలర్లకు అందిస్తుంటాడు. ప్రత్యేకించి స్పిన్నర్లతో కలిసి ధోని చేసే మాయజాలం అందరికీ తెలిసిందే. అశ్విన్, జడేజాలతో పాటు ఇప్పుడు చాహల్, కుల్దీప్లతోనూ మహి మ్యాజిక్ కొనసాగుతోంది. అయితే, కొన్ని సార్లు ధోని చిట్కాలు సైతం వికటిస్తాయని చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. ' మైదానంలో ధోని కూల్‌గా ఉంటాడు. ఎక్కువగా మాట్లాడడు. కచ్చితంగా అవసరం అనుకుంటే, ఓవర్ల మధ్యలో చిట్కాలు అందిస్తాడు. కానీ అతడు చెప్పే సలహాలు కొన్ని సార్లు పని చేయవు. ఆ విషయం ధోనికి చెప్పలేను' అని కుల్దీప్ యాదవ్ అన్నాడు. ఐపీఎల్12లో అంచనాలను భిన్నంగా పేలవ ప్రదర్శన చేసిన కుల్దీప్ యాదవ్..తాజాగా ప్రపంచకప్‌కు సిద్ధమవుతున్నాడు. 2014లో టెస్టు క్రికెట్‌కు గుడ్ బై పలికిన ధోని.. 2017లో వన్డే, టీ20 సారథ్యాన్ని వదులుకున్నాడు. బహుశా, 2019 వరల్డ్‌కప్ తర్వాత మహి అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పు కునే అవకాశముందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.