Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసీస్‌తో హాకీ సిరీస్
పెర్త్ : భారత పురుషుల హాకీ జట్టు ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో పరాజయం పాలైంది. ఐదు టెస్ట్‌మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బుధవారం ఆతిథ్యజట్టుతో తలపడి 0-4 గోల్స్‌తో పరాజయాన్ని చవిచూసింది. అంతకుముందు ఆస్ట్రేలియా-ఏతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌ను 1-1తో డ్రాగా ముగించిన భారత బృందం నేటిమ్యాచ్లో నిరాశజనక ప్రదర్శన చేసింది. పెర్త్ హాకీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ తరఫున బ్లేక్ గోవర్, జెరేమీ హైవార్డ్లు రెండేసి గోల్స్‌తో సత్తా చాటారు. ఆస్ట్రేలియా రెండో క్వార్టర్లో రెండు గోల్స్ చేసి 2-0 ఆధిక్యతలోకి దూసుకెళ్లింది. నాల్గో క్వార్టర్లో మూడు నిమిషాల ముందు... ఆఖరి సెకన్లలో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌చేసి ఆసీస్ 4-0 ఆధిక్యతను సంపాదించింది.