Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పారిస్: గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫ్రెంచ్ ఓపెన్ నుంచి మాజీ చాంపియన్, రష్యన్ స్టార్ క్రీడాకారిణి మరియా షరపోవా వైదొలిగింది. భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న షరపోవా ఇంకా పూర్తిగా కోలుకోపోవడంతో టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు బుధవారం ప్రకటించింది. 'నేను ఫ్రెంచ్ ఓపెన్ నుంచి తప్పుకుంటున్నాను. కొన్ని సందర్భాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం అంత సులభతరం కాదు' అని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ఇప్పటివరకూ ఓవరాల్‌గా ఐదు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన షరపోవా.. రెండుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్‌ను సొంతం చేసుకున్నారు. 2012,14లో షరపోవా ఫ్రెంచ్ ఓపెన్‌లో విజేతగా నిలిచింది. అయితే ఈ ఏడాది జనవరి నుంచి ఏ టోర్నీలోనూ షరపోవా పాల్గొనలేదు. ఫిబ్రవరి నెలలో భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న షరపోవా ప్రస్తుతం విశ్రాంతి తీసుకొని కోలుకుంటోంది. 26 నుంచి ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే.