Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరల్డ్‌కప్‌లో మాస్టర్‌బ్లాస్టర్ అద్భుతాలెన్నో..
- టెండూల్కర్ ఖాతాలో ఎన్నో రికార్డులు..
నవతెలంగాణ క్రీడాప్రతినిధి
మాస్టర్ బ్లాస్టర్ సచిన్టెండూల్కర్ క్రికెట్ గాడ్‌గా అభిమానులు కొలుస్తారు. ఇటు టెస్టులు.. అటు వన్డేల్లోనూ సచిన్ చేసిన పరుగులు, శతకాలు అంబరాన్ని తాకుతాయి. అలానే వరల్డ్‌కప్ లో కూడా సచిన్ రికార్డులు తిరుగులేనివి. ప్రపంచకప్ క్రికెట్ పోటీల్లో భారత క్రికెట్ జట్టులో ఏకైక సఫలమైన క్రీడాకారుడిగా సచిన్ నిలుస్తాడు. అత్యధిక పరుగులు..ఎక్కువ సెంచరీలు కొట్టిన రికార్డు ఆయన పేరున ఉన్నది. వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఘనత కూడా అతను సాధించాడు.
ఆరు వరల్డ్‌కప్‌లలో ఆడిన రికార్డు
వరల్డ్‌కప్ క్రికెట్లో అత్యధికంగా మ్యాచులు ఆడిన రికార్డు సచిన్ పేరున ఉన్నది. 1991 నుంచి 2011 వరకు వరుసగా ఆరు ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలలో ఆడాడు. ఈ విధంగా సచిన్ తో పాటు పాక్ తరఫున ఆడిన బ్యాట్స్‌మెన్ జావిద్ మియాందాద్ సమానంగా ఉండటం గమనార్హం. మియాందాద్ వరుసగా (1975..1996) ప్రపంచకప్ క్రికెట్ ఆడాడు.
అత్యధిక పరుగులు
సచిన్ టెండూల్కర్ వరల్డ్‌కప్ రెండు వేల పరుగుల ఫీట్ చేసిన ఏకైక క్రికెటర్. 56.95 యావరేజీతో 2,275 పరుగులు సాధించాడు. ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు పాక్ క్రికెటర్ మియాందాద్ పేరున ఉండేది. అతను 33 మ్యాచులు ఆడి 1,083 పరుగులు చేశాడు. మియాందాద్ రిటైరయ్యాక..1999లో వరల్డ్‌కప్ ఆడిన సచిన్ అత్యధిక పరుగుల రికార్డును తన సొంతం చేసుకున్నాడు.
సెంచరీల మోత
వరల్డ్‌కప్ 45 మ్యాచుల్లో సచిన్ అత్యధికంగా సెంచరీలు బాదాడు. ఆరు శతకాలు తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ రికిపాంటింగ్, కుమారసంగక్కర(శ్రీలంక) వరల్డ్ కప్‌లో చేరో ఐదు సెంచరీలు కొట్టారు. వరల్డ్ కప్‌లో సెంచరీలు కొట్టిన ఇండియా టీమ్‌లో సౌరవ్గంగూలీ పేరున నాలుగు సెంచరీలు నమోదయ్యాయి.
హాఫ్ సెంచరీల్లోనూ..
సచిన్ సెంచరీల రికార్డులే కాదు...హాఫ్ సెంచరీల్లో మోత పుట్టించాడు. వరల్డ్ కప్‌లో అత్యధికంగా హాఫ్ సెంచరీలు కొట్టిన రికార్డూ మాస్టర్ బ్లాస్టర్ సొంతం. పది హాఫ్ సెంచరీలు కొట్టాలంటే మాటలు కాదు. అలాంటిది సచిన్ ఏకంగా 15 హాఫ్ సెంచరీలు బాదిన ఘనత అతడిదే. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ జాక్ కలిస్ కూడా తొమ్మిది హాఫ్ సెంచరీలతో టేబుల్లో సచిన్ వెనుక ఉన్నాడు.
అత్యధిక పరుగులు
2003లో జరిగిన వరల్డ్ కప్ మ్యాచుల్లో ఏ క్రికెటర్ సాధించనన్నీ పరుగులు చేశాడు. కేవలం 11 మ్యాచుల్లో 61.18 యావరేజీతో 673 పరుగులు చేశాడు. ఇది ఇప్పటికీ ఆ రికార్డు చెక్కు చెదరలేదు.
ఎక్కువ ఇన్నింగులు
ఆరు వరల్డ్ కప్ మ్యాచుల్లో సచిన్ ఆడిన ఇన్నింగులు 44. ఇది కూడా ఓ రికార్డే. కానీ అతను ఎక్కువ మ్యాచులు ఆడలేదు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికి పాంటింగ్ 46 ఇన్నింగులు ఆడాడు.
అత్యధిక మ్యాన్ ఆఫ్‌ది మ్యాచులు
వన్డే క్రికెట్లో 62 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రికార్డులను సచిన్ దక్కించుకున్నడు. వరల్డ్ కప్‌లోనూ 9 సార్లు ఆ ఫీట్ సాధించాడు. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ ఆరు సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రికార్డును సొంతం చేసుకుని..రెండోస్థానంలో నిలిచాడు.
బౌండరీలు కొట్టడంలో ఫస్ట్
క్లాసికల్ కవర్‌డ్రైవ్,బ్యాక్ ఫుట్ కవర్‌డ్రైవ్, పచింగ్ కవర్‌డ్రైవ్,స్వ్కైర్ కట్, లెగ్ గ్లాన్స్,ఫ్లిక్, పుల్ షాట్,అపర్ కట్‌తో సచిన్ అలరిస్తాడు. అతని షాట్లకు క్రీడాభిమానులు పిచ్చపిచ్చగా ఆహ్లాదపడతారు. బ్యాటింగ్‌లోనూ అలరించటంతో పాటు బౌండరీలు కొట్టడంలోనూ తనదైన సత్తా చాటాడు. అతని ఖాతాలో 241 బౌండరీలు ఉన్నాయి.
తొమ్మిదో వికెట్ భాగస్వామ్యం..
1999 మే..23న సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ కలిసి కెన్యాకు వ్యతిరేకంగా జరిగిన మ్యాచ్‌లో237 పరుగులు చేశారు.మూడో వికెట్ భాగస్వామ్యంగా ఈ జోడీ నెలకొన్న రికార్డు ఇప్పటికీ అలానే ఉన్నది.
మూడు సార్లు 450 పరుగులు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్
1996లో వరల్డ్‌కప్‌లో సచిన్ 523 పరుగులు చేశాడు. 2003లో జరిగిన వరల్డ్‌కప్‌లో 673 పరుగులు చేశాడు.2011 ప్రపంచకప్‌లోనూ సచిన్ తడాఖా చూపాడు. 9 మ్యాచుల్లో 53.56 యావరేజీతో 482 పరుగులు చేశాడు.