Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టార్ స్ప్రింటర్ ద్యుతీ చంద్
హైదరాబాద్ : 19 ఏండ్ల అమ్మాయితో మూడేండ్లుగా సహజీవనం చేస్తున్నానని ప్రకటించిన భారత స్టార్ స్ప్రింటర్కు సోషల్ మీడియాలో అభిమానులు, ప్రముఖులు విశేష స్థాయిలో మద్దతు తెలుపుతున్నారు. స్వలింగ సంపర్కురాలిగా ప్రకటించుకున్న ద్యుతీ.. ట్రాక్‌పైనే కాదు, బయటా ట్రెండ్ సృష్టించింది. ఒడిశాలోని ద్యుతీ కుటుంబ సభ్యులు మాత్రం ఆసియా రజత విజేత లెస్బియన్ వివాహ బంధాన్ని అంగీకరించబోమని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యుల వ్యతిరేకతపై ద్యుతీ స్పందించింది. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ కోసం సన్నద్ధమవుతున్న ద్యుతీ చంద్ ప్రస్తుతం హైదరాబాద్‌లో సాధన చేస్తోంది. ' ఇంటి నుంచి గెంటివేస్తామని మా అక్క హెచ్చరించింది. ఆమె ఎప్పుడూ అంతే. మా అన్న భార్య నచ్చలేదని ఆమెను ఇంటి నుంచి పంపించింది. ఇప్పుడు నా విషయంలోనూ అదే చేస్తానంటోంది. అది ఆమె ఇష్టం. కానీ నా జీవితాన్ని ఎవరితో పంచుకోవాలని, ఎవరిని ప్రేమించాలనేది పూర్తిగా నా వ్యక్తిగత విషయం. అమ్మాయితో సహజీవనం చేస్తున్నందుకు నేనేమీ సిగ్గు పడటం లేదు. స్వలింగ సంపర్కురాలిని అని గర్వంగా ప్రకటించుకున్నాను' అని ద్యుతీ చంద్ తెలిపింది.