Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మట్టిలో మరో టైటిల్‌పై నడాల్ గురి
- నేటి నుంచి ఫ్రెంచ్ ఓపెన్
పారిస్ : ఫ్రెంచ్ ఓపెన్‌ను 11 సార్లు గెల్చుకుని ప్రపంచ రికార్డు నెలకొల్పిన స్పెయిన్ బుల్ రఫెల్ నడాల్, మట్టికోర్టులో మరో గ్రాండ్‌స్లామ్‌పై కన్నేశాడు. గత వారం రోమ్ ఓపెన్ విజేతగా నిలిచిన నడాల్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఐదు సెట్ల మ్యాచ్‌లో మట్టిపై నడాల్‌ను ఓడించటం అంత సులువు కాదు. నేటి నుంచి ఆరంభం కానున్న ఫ్రెంచ్ ఓపెన్‌లో రెండో సీడ్ నడాల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతున్నాడు. చిరకాల ప్రత్యర్థి, నాలుగేండ్ల తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ ఆడుతున్న రోజర్ ఫెడరర్ సెమీఫైనల్లో నడాల్‌కు సవాల్ విసిరే అవకాశం ఉంది. డ్రాలో ఒకే పార్శ్యంలో ఇద్దరు దిగ్గజాలు చోటు చేసుకున్నారు. టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్‌కు జర్మనీ యువ సంచలన అలెగ్జాండర్ జ్వెరెవ్ ఎదురు పడనున్నాడు. టాప్-10 ప్లేయర్స్‌కు కనీసం క్వార్టర్‌ఫైనల్స్ వరకూ గట్టి పోటీ ఎదురయ్యే వీలు లేదు. ఫెడరర్‌కు క్వార్టర్స్‌లో గ్రీకు సంచలనం స్టెఫానిస్ సిట్పిపస్ పరీక్షగా నిలిచే అవకాశం ఉంది. మహిళల సింగిల్స్‌లో సెరెనా విలియమ్స్ రికార్డు 24వ గ్రాండ్‌స్లామ్‌పై కన్నేసింది. ఆమెకు డిఫెండింగ్ చాంప్ సిమోన హలెప్, కరొలినా ఫ్లిస్కోవా, కెర్బర్, ఎంజెలికా గట్టి పోటీ ఇవ్వనున్నారు.