Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసీస్‌తో వార్మప్‌లో కాలింగ్‌వుడ్ ఫీల్డింగ్
సౌతాంప్టన్ : ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో అరుదైన సంఘటన చోటు చేసుకున్నది. ఓ జట్టు సహాయక సిబ్బంది మైదానంలోకి దిగి, ఫీల్డింగ్ చేయటం సంచలనం సృష్టించింది. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్, ప్రస్తుత సహాయక కోచ్ కాలింగ్‌వుడ్ ఆసీస్‌తో మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేశాడు. సీమర్లు జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్లు గాయానికి గురయ్యే ప్రమాదంలో పడగా.. వెంటనే డ్రెస్సింగ్‌రూమ్‌కు చేరుకున్నారు. చేతి వేలి గాయంతో కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ డ్రెస్సింగ్‌రూమ్‌కు పరిమితం అయ్యాడు. స్పిన్నర్ ఆదిల్ రషీద్ భుజం గాయంతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఆటగాళ్లందరూ ఇలా మైదానంలో అడుగు పెట్టలేని పరిస్థితిలో ఫీల్డింగ్ కోచ్ కాలింగ్‌వుడ్ (42 ఏండ్ల వయసు) ప్రపంచకప్ జెర్సీతో బరిలోకి దిగాడు. 2010 వరల్ట్ టీ20 టైటిల్ సాధించిన కాలింగ్‌వుడ్.. 197 వన్డేల్లో 5000 ప్లస్ పరుగులతో పాటు 111 వికెట్లు కూల్చాడు.