Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజరు గాయం చిన్నదే
- ఎటువంటి ఫ్రాక్చర్ లేదు
లండన్ : ప్రపంచకప్ సన్నాహాక సమరానికి ముందే టీమ్ ఇండియాను విజరు శంకర్ గాయం ఆందోళనకు గురి చేసింది. ప్రాక్టీస్ సెషన్లో నెట్ సీమర్ ఖలీల్ అహ్మద్ బంతి విజరు శంకర్ కుడి ముంజేతికి తగిలింది. దీంతో ప్రాక్టీస్ సెషన్ మధ్యలోనే విజరు శంకర్ మైదానాన్ని వీడాడు. స్కానింగ్ రిపోర్టులో ఎటువంటి ఫ్రాక్చర్ కాలేదని తెలిసి, జట్టు మేనేజ్మెంట్ ఊపిరీపీల్చుకున్నది. సీమ్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా జట్టులోకి వచ్చినా.. నం.4 స్థానంలో స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గా విజరు శంకర్ కొత్త పాత్ర పోషించనున్నాడు. శనివారం న్యూజిలాండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు ముందు ఒంటి చేత్తో బ్యాటింగ్ సాధన చేస్తూ కనిపించిన విజరు మ్యాచ్‌లో ఆడలేదు. బంగ్లాదేశ్‌తో వార్మప్‌లోనూ విజరుని ఆడించే అవకాశం కనిపించటం లేదు. తగినంత విశ్రాంతితో నేరుగా వరల్డ్‌కప్ మ్యాచ్ ఆడనున్నాడు.