Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సౌతాంప్టన్ : దక్షిణాఫ్రికా స్పీడ్‌స్టర్, వెటరన్ పేసర్ డెల్ స్టెయిన్ ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. భుజం గాయంతో ఇబ్బంది పడుతున్న స్టెయిన్ ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ మ్యాచుల్లో ఆడలేదు. భారత్‌తో మ్యాచ్‌కు ఫిట్నెస్ సాధిస్తాడని ఆశించినా, అది జరుగలేదు. దీంతో ప్రపంచకప్‌కు స్టెయిన్ దూరమయ్యాడు. అతడి స్థానంలో సీమర్ హెండ్రిక్స్‌ను దక్షిణాఫ్రికా జట్టులోకి ఎంపిక చేసింది. ' డెల్ స్టెయిన్ రెండోసారి భుజం గాయానికి గురయ్యాడు. వైద్యానికి గాయం స్పందించటం లేదు. సమీప భవిష్యత్‌లో అతడు బౌలింగ్ చేసే అవకాశం లేదు. ప్రపంచకప్‌కు స్టెయిన్ దూరమయ్యాడు' అని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఐపీఎల్12లో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ తరఫున రెండు మ్యాచుల్లో ఆడిన స్టెయిన్ భుజం గాయానికి గురయ్యాడు. అదే గాయంతో ఇప్పుడు ప్రపంచకప్‌కు దూరమయ్యాడు.