Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరాచి: 2010 పాకిస్థాన్ ఫిక్సింగ్ కుంభకోణంలో సీమర్ మహ్మద్ ఆమీర్‌పై అప్పటి కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది చేయి చేసుకున్నాడని ఆ జట్టు మాజీ ఆల్‌రౌండ్ అబ్దుల్ రజాక్ వెల్లడించారు. ' నన్ను గది నుంచి బయటకి వెళ్లమని ఆఫ్రిది చెప్పాడు. కొద్దిసేపటికే గది నుంచి చెంప దెబ్బల శబ్దం స్పష్టం వినిపించింది. చెంప చెళ్లుమన్నాక ఫిక్సింగ్పై ఆమీర్ అంతా చెప్పాడు' అని రజాక్ పేర్కొన్నాడు. మహ్మద్ అసిఫ్, మహ్మద్ ఆమీర్, సల్మాన్ భట్‌లపై ఐదేండ్ల నిషేధం విధించగా.. మహ్మద్ ఆమీర్ ఒక్కడే తిరిగి జాతీయ జట్టులోకి వచ్చాడు. ప్రస్తుతం ప్రపంచకప్‌లో ఆడుతున్నాడు.