Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిగ్ హిట్టర్స్ ఇంగ్లాండ్, విండీస్ ఢ నేడే
- పరుగుల వరద ఖాయం
సౌతాంప్టన్ : వరుణుడు అంతరాయం కలిగించకపోతే.. ప్రపంచకప్ మరో మెగా వార్‌కు సిద్ధమైంది. ప్రమాదకర హిట్టర్లు ముఖాముఖి పోరుకు రెఢ అయ్యారు. టైటిల్ ఫేవరెట్ ఆతిథ్య ఇంగ్లాండ్, సర్ప్రైజ్ ఫేవరెట్ వెస్టిండీస్ నేడు సౌతాంప్టన్‌లో సమరానికి సై అంటున్నాయి. పవర్ ప్లేలో క్రిస్ గేల్ వర్సెస్ జేసన్ రారు, జానీ బెయిర్‌స్టో.. మిడిల్లో జో రూట్ వర్సెస్ హెట్మయర్, హౌప్... ఆఖర్లో రసెల్ వర్సెస్ జోశ్ బట్లర్ విధ్వంసాల్లో ఎవరు పైచేయి సాధిస్తారనే ఆసక్తి క్రికెట్ విశ్లేషకులతో పాటు అభిమానుల్లోనూ కనిపిస్తోంది. ప్రపంచ కప్‌కు ముందు ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌ను డ్రా చేసుకున్న వెస్టిండీస్.. వరల్డ్ కప్ రేసులోకి వేగంగా దూసుకొచ్చింది. ఆసీస్‌పై నెగ్గాల్సిన మ్యాచ్‌ను చేజార్చుకుని, సఫారీపై వర్షంతో పాయింట్ పంచుకుని కరీబియన్లు పాయింట్ల పట్టికలో దిగువ భాగాన ఉన్నారు. నేడు ఇంగ్లాండ్‌పై విజయంతో ఎగబాకాలని విండీస్ ఆశిస్తోంది.
ప్రపంచకప్‌లో భారత్, పాక్ తర్వాత అంత ఆసక్తి నెలకొల్పుతున్న మ్యాచ్ ఇదే!. బ్యాట్‌తో ఇరు జట్లలోనూ విధ్వంసకారులకు కొదవ లేదు. బంతితో బ్యాట్స్‌మెన్‌ను కవ్వించగల సీమర్లకు కరువు లేదు. విండీస్ అండర్-19 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కలేదని ఇంగ్లాండ్‌కు వలస వచ్చిన స్టార్ సీమర్ జోఫ్రా ఆర్చర్ నేడు మాజీ సహచరులపై బౌన్సర్లు ప్రయోగించనున్నాడు. ఫ్యాషన్‌గా ఆడుతున్న విండీస్ శిబిరంలో ఒసేన్ థామస్, షెల్డన్ కాట్రెల్ వికెట్ల వేట ఆసక్తిగా ఉంటుంది. అంచనాల ప్రకారం నేడు భారీ స్కోర్లు నమోదైతే ఇరు జట్లలో మెగా హిట్టర్లు జోశ్ బట్లర్, అండ్రీ రసెల్ కీలక పాత్ర పోషించనున్నారు. ప్రపంచకప్‌లో కొత్త కొత్త వ్యూహాలతో ఆశ్చర్యపరుస్తున్న కెప్టెన్లు జేసన్ హౌల్డర్, ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీ ఢపౖీెనా ఫోకస్ కనిపిస్తోంది. పరుగుల వరద ఖాయంగా అంచనా వేస్తోన్న మ్యాచ్‌ను అభిమానులు వద్దనుకుంటారా? నేడు ఇంగ్లాండ్, వెస్టిండీస్ సమరం. బాదిన జట్టునే విజయం వరిస్తుందని చెప్పనక్కర్లేమో!.
వర్షం ముప్పు : సౌతాంప్టన్‌లో కొద్ది రోజులుగా వర్షం కురుస్తూనే ఉంది. ఇక్కడి మ్యాచులు సైతం రద్దయ్యాయి. నేడు సైతం వర్షం ప్రమాదం నెలకొంది. ఆరంభంలో సీమర్లకు లభించే గొప్ప అనుకూలతతో టాస్ నెగ్గిన జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకునే వీలుంది. ఇరు జట్లలోనూ బిగ్ హిట్టర్లున్నారు. ఛేదనకు కెప్టెన్లు ఇష్టపడతారు.