Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అఫ్గాన్‌పై తొలుత బ్యాటింగ్. భారీ స్కోరు ఆశలు. పరిస్థితి తారుమారు. రోహిత్ శర్మ (1) నిష్క్రమణతో పరుగుల వేటలో వెనుకంజ. కెప్టెన్ కోహ్లి (67), కేదార్ జాదవ్ (52) అర్ధ సెంచరీలతో భారత్ 224 పరుగులు చేసింది.
స్వల్ప ఛేదనలో అఫ్గనిస్థాన్ ఆఖరు వరకూ పోరాడింది. సమష్టి ప్రదర్శనతో కోహ్లిసేనపై చారిత్రక విజయం స్వప్నించారు. కానీ బుమ్రా సారథ్యంలోని బౌలర్లు అఫ్గాన్ ఆశలు ఆవిరి చేశారు. ప్రపంచకప్‌లో భారత్‌కు 50వ విజయాన్ని అందించారు. 2019 ప్రపంచకప్‌లో కోహ్లిసేన అజేయ రికార్డు కొనసాగించింది.
సౌతాంప్టన్: అఫ్గాన్ బంతితో బ్యాట్స్‌మెన్‌ను నిలువరించింది. ఛేదనలో బ్యాట్‌తో ఆఖరు వరకూ పోరాడింది. ప్రపంచకప్‌లో మెగా సంచలనానికి చేరువగా వచ్చింది. కానీ ఒత్తిడిలో విజయాలు సాధించటంలో రాటుదేలిన కోహ్లిసేన 11 పరుగుల తేడాతో సాధికారిక విజయం సాధించింది. మహ్మద్ షమి (4/40) ఆఖరి ఓవర్ హ్యాట్రిక్ వికెట్లతో అఫ్గనిస్థాన్ 213 పరుగులకే కుప్పకూలింది. ఛేదనలో మహ్మద్ నబి (52, 55 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ పోరాటం వృథా అయ్యింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (67, 63 బంతుల్లో 5 ఫోర్లు), కేదార్ జాదవ్ (52, 68 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో తొలుత భారత్ 224/8 పరుగులు చేసింది. బుమ్రా 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు.
నబి భయపెట్టినా.. : ఊరించే ఛేదనలో అఫ్గనిస్థాన్ గొప్ప ప్రదర్శన చేసింది. ఓపెనర్ హజ్రతుల్లా జాజారు (10), అస్గర్ అఫ్గాన్ (8) మినహా బ్యాటింగ్ లైనప్‌లో అందరూ బాధ్యత తీసుకున్నారు. గులాబ్దిన్ నయిబ్ (27), రెహమత్ షా (36), హస్మతుల్లా షాహిది (21), నజీబుల్లా జద్రాన్ (21) ఆకట్టుకున్నారు. రెహమత్ షా, హస్మతుల్లాను ఒకే ఓవర్లో అవుట్ చేసిన బుమ్రా మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పడు. నబీ ఒంటరి పోరాటంతో ఆఫ్గాన్ ఆశలు ఆఖరు వరకూ నిలిపాడు. ఆఖరు 12 బంతుల్లో 21 పరుగులు చేయాల్సిన దశలో బుమ్రా 5 పరుగులే ఇచ్చాడు. చివరి ఓవర్లో 16 పరుగులు చేయాల్సి ఉండగా.. షమి తొలి బంతిని నబి బౌండరీకి తరలించి ఉత్కంఠ రేపాడు. గొప్పగా పుంజుకున్న షమి.. వరుసగా నబి, అప్తాబ్ (0), ముజీబ్ (0)లను అవుట్ చేసి ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ వికెట్లతో పాటు భారత్‌కు 50వ విజయాన్ని అందించాడు.
ఆదుకున్న కోహ్లి, కేదార్ : టాస్ నెగ్గిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకోగానే.. అందరి అంచనాలు 350-400 పైనే ఉన్నాయి. టాప్ ఆర్డర్ సూపర్ ఫామ్ అందుకు మరింత ఆజ్యం పోసింది. అఫ్గనిస్థాన్ వ్యూహం మరో విధంగా రాసుకుంది!. ఊహించనట్టే పవర్ ప్లేలో అఫ్గాన్ స్పిన్ అస్త్రాన్ని ప్రయోగించింది. భీకర ఫామ్‌లో ఉన్న ఓపెనర్ రోహిత్ శర్మ (1)ను ముజీమ్ క్యారమ్ బాల్‌తో క్లీన్ బౌల్డ్ చేసి, ఆశ్చర్యపరిచాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లోనే కోహ్లి క్రీజులోకి వచ్చేలా చేశాడు. అఫ్తాబ్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదిన కెఎల్ రాహుల్ (30) చెత్త షాట్‌తో వికెట్ పారేసుకున్నాడు. కోహ్లితో కలిసి ఇన్నింగ్స్ ముందుకు తీసుకెళ్లేలా కనిపించిన రాహుల్ నిర్లక్ష్య షాట్‌తో పెవిలియన్‌కు చేరుకున్నాడు. అఫ్తాబ్ బౌలింగ్‌లోనే బౌండరీ ఖాతా తెరిచిన కోహ్లి.. వరుసగా రెండు ఫోర్లు బాదాడు. ముజీబ్పైనా ఓ బౌండరీ బాదాడు. కోహ్లి ప్యాడ్లపైకి అఫ్గాన్ బంతులేయగా.. అతడు నేరుగా బౌండరీ లైన్ దాటించాడు. 48 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించిన కోహ్లిని మహ్మద్ నబి వెనక్కి పంపాడు. అంతకుముందే విజరు శంకర్ (29) వికెట్ కోల్పోయాడు. 30.3 ఓవర్లలో 135/4తో భారత్ ఒత్తిడిలో పడింది. పరుగులు కష్టమైన వేళ అఫ్గాన్ బౌలర్లు ఉత్సాహంగా బంతులేశారు. ధోని (28) మూడు ఫోర్లు బాదినా.. కడ వరకూ క్రీజులో ఉండలేదు. రషీద్ ఖాన్ బంతి కోసం క్రీజు వదిలిన ధోని, 2011 తర్వాత వన్డేల్లో స్టంపౌట్ కావటం ఇదే తొలిసారి. హార్దిక్ పాండ్య (7) సైతం నిరాశపరిచాడు. ఈ పరిస్థితుల్లో కేదార్ జాదవ్ (52) అర్ధ సెంచరీతో మెరిశాడు. మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌తో భారత్‌కు పోరాడగలిగే స్కోరు అందించాడు. అఫ్గాన్ బౌలర్లలో గులాబ్దిన్ నయిబ్ (2/51), మహ్మద్ నబి (2/33), రషీద్ ఖాన్ (1/38) రాణించారు.
భారత్ ఇన్నింగ్స్ : కెఎల్ రాహుల్ (సి) హజ్రతుల్లా (బి) నబి 30, రోహిత్ శర్మ (బి) ముజీబ్ 1, విరాట్ కోహ్లి (సి) రెహమత్ (బి) నబి 67, విజరు శంకరÊ (ఎల్బీ) రెహమత్ 29, ఎం.ఎస్ ధోని (స్టంప్డ్) అలీ (బి) రషీద్ ఖాన్ 28, కేదార్ జాదవ్ (సి) నూర్ అలీ (బి) నయిబ్ 52, హార్దిక్ పాండ్య (సి) అలీ (బి) అఫ్తాబ్ 7, మహ్మద్ షమి (బి) నయిబ్ 1, కుల్దీప్ యాదవ్ నాటౌట్ 1, జశ్‌ప్రీత్ బుమ్రా నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు : 07, మొత్తం : (50 ఓవర్లలో 8 వికెట్లకు) 224.
వికెట్ల పతనం : 1-7, 2-64, 3-122, 4-135, 5-192, 6-217, 7-222, 8-223.
బౌలింగ్ : ముజీబ్ రెహమాన్ 10-0-26-1, అఫ్తాబ్ ఆలమ్ 7-1-54-1, గులాబ్దిన్ నయిబ్ 9-0-51-2, మహ్మద్ నబి9-0-33-2, రషీద్ ఖాన్ 10-0-38-1, రెహమత్ షా 5-0-22-1.
అఫ్గనిస్థాన్ ఇన్నింగ్స్ : హజ్రతుల్లా జాజారు (బి) మహ్మద్ షమి 10, గులాబ్దిన్ నయిబ్ (సి) విజరు (బి) హార్దిక్ పాండ్య 27, రెహమత్ షా (సి) చాహల్ (బి) బుమ్రా 36, హస్మతుల్లా షాహిది (సి,బి) బుమ్రా 21, అస్గర్ అఫ్గాన్ (బి) చాహల్ 8, మహ్మద్ నబి (సి) హార్దిక్ పాండ్య (బి) మహ్మద్ షమి 52, నజీబుల్లా జద్రాన్ (సి) చాహల్ (బి) హార్దిక్ పాండ్య 21, రషీద్ ఖాన్ (స్టంప్డ్) ధోని (బి) చాహల్ 14, ఇక్రమ్ అలీ నాటౌట్ 7, అఫ్తాబ్ (బి) మహ్మద్ షమి 0, ముజీబ్ (బి) మహ్మద్ షమి 0, ఎక్స్‌ట్రాలు : 17, మొత్తం : (49.5 ఓవర్లలో ఆలౌట్) 213.
వికెట్ల పతనం : 1-20, 2-64, 3-106, 4-106, 5-130, 6-166, 7-190, 8-213, 9-213, 10-213.
బౌలింగ్ : మహ్మద్ షమి 9.5-1-40-4, జశ్‌ప్రీత్ బుమ్రా 10-1-39-2, యుజ్వెంద్ర చాహల్ 10-0-36-2, హార్దిక్ పాండ్య 10-1-51-2, కుల్దీప్ యాదవ్ 10-0-39-0.