Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బంగ్లా ఖాతాలో మరో విజయం
- షకిబ్ ఆల్‌రౌండ్ ప్రదర్శన
సౌతాంప్టన్ : ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ సూపర్ ప్రదర్శన కొనసాగుతోంది. ముచ్చటగా మూడో విజయం సాధించిన బంగ్లాదేశ్ సెమీఫైనల్స్ రేసులో అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. రెండు రోజుల క్రితం అగ్రజట్టు భారత్‌ను వణికించిన అఫ్గనిస్థాన్‌ను బంగ్లాదేశ్ చిత్తుగా ఓడించింది. షకిబ్ అల్ హసన్ (5/29, 51 రన్స్) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో 62 పరుగుల తేడాతో అఫ్గాన్‌పై విజయం సాధించింది. ముష్ఫీకర్ రహీమ్ (83, 87 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), షకిబ్ అల్ హసన్ (51, 69 బంతుల్లో 1 ఫోర్) అర్ధ సెంచరీలతో తొలుత బంగ్లాదేశ్ 262/7 పరుగులు చేసింది. తమీమ్ ఇక్బాల్ (36), మహ్మదుల్లా (27), మొసద్దిక్ హుస్సేన్ (35) రాణించారు. సౌమ్య సర్కార్ (3), లిటన్ దాస్ (16) విఫలమయ్యారు. అఫ్గాన్ బౌలర్లలో ముజీబ్ రెహమాన్ (3/39), గుల్బాదిన్ నైబ్ (2/56) ఆకట్టుకున్నారు. ఛేదనలో అఫ్గనిస్థాన్‌కు మంచి ఆరంభం లభించింది. గుల్బాదిన్ నైబ్ (47, 75 బంతుల్లో 3 ఫోర్లు), రెహమత్ షా (24) తొలి వికెట్‌కు 49 పరుగులు జోడించారు. రెహమత్ షా, అస్గర్ అప్గాన్ (11), గుల్బాదిన్, నజీబుల్లా (23),మహ్మద్ నబి (0) షకిబ్ మాయలో పడిపోయారు. షకిబ్ ఐదు వికెట్ల ప్రదర్శన అఫ్గాన్‌ను చిత్తు చేసింది. చివర్లో సైముల్లా (49) పోరాడినా అఫ్గాన్‌కు భారీ ఓటమి తప్పలేదు. 47 ఓవర్లలో 200 పరుగులకే అఫ్గనిస్థాన్ కుప్పకూలింది.