Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బంది లేదు
ముంబయి : దిగ్గజ క్రికెటర్, వెస్టిండీస్ మాజీ ఆటగాడు బ్రియాన్ లారా స్వల్ప అస్వస్థతతో ముంబయిలోని గ్లోబల్ హాస్పిటల్లో చేరారు. ఐపీఎల్, ప్రపంచకప్‌లలో స్టార్‌స్పోర్ట్స్ డగౌట్ ప్రత్యేక వ్యాఖ్యానం చేస్తున్న బ్రియాన్ లారా గత కొన్ని మాసాలుగా ముంబయిలోనే ఉంటున్నారు. మంగళవారం ఉదయం ఛాతిలో ఇబ్బందిగా ఉందని లారా ఆస్పత్రిలో చేరారు. ' ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. లారా ప్రస్తుతానికి బాగున్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు' అని సంబంధిత వర్గాలు తెలిపాయి. జూన్ 27న వెస్టిండీస్‌తో మ్యాచ్‌కు యథావిథిగా లారా వ్యాఖ్యానం చేస్తాడని సమాచారం.