Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఫ్గాన్‌తో పాక్.. ఆసీస్‌తో కివీస్ ఢీ
లార్డ్స్ : ప్రపంచకప్ సెమీఫైనల్స్ రేసు రసవత్తర ముగింపుకు చేరుకుంటుంది. గ్రూప్ దశ ఆఖరి మ్యాచుల్లో ఇది మరింత ఆసక్తి రేపుతోంది. మూడు విజయాలతో సెమీస్ రేసులో ఆశలు నిలుపుకున్న పాకిస్థాన్ నేడు కీలక మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. పసికూన అఫ్గనిస్థాన్‌తో నేడు సర్ఫరాజ్ సేన తలపడనుంది. అఫ్గాన్ ఆడిన ఏడు మ్యాచుల్లోనూ ఓడినా.. నాణ్యమైన స్పిన్‌తో విజయాలు సాధించగలదు. అనిశ్చితి పాకిస్థాన్ ఎలా ఆడుతుందో చెప్పలేని కారణంగా, అఫ్గాన్ విజయంపై ఆశలు పెట్టుకుంది. నేడు అఫ్గాన్‌పై, చివరి మ్యాచ్‌లో బంగ్లాపై పాక్ సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయి!. మరో మ్యాచ్‌లో పొరుగు దేశాలు పోటీకి రెఢ అయ్యాయి. సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్న డిఫెండింగ్ చాంపియన్‌తో, 2015 రన్నరప్ న్యూజిలాండ్ తలపడనుంది. పాక్ చేతిలో ఓడిన కివీస్ సెమీస్‌కు ఓ విజయం దూరంలో నిలిచింది. నేడు ఆసీస్‌పై నెగ్గితే మరో మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా సెమీస్‌లోకి వెళ్లనుంది. చివరి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఎదుర్కొవాల్సి ఉన్నందున, లార్డ్స్‌లోనే లాంఛనం ముగించాలని విలియమ్సన్ భావిస్తున్నాడు.