Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బుమ్రా అండతో వికెట్ల వేట
బర్మింగ్‌హామ్ : ప్రపంచకప్‌లో మహ్మద్ షమి జోరు కొనసాగుతోంది. వరుసగా మూడో మ్యాచ్‌లో మహ్మద్ షమి 4 ప్లస్ వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్‌పై మెరుగైన రికార్డు లేని షమి.. బర్మింగ్‌హామ్‌లో నిప్పులు చెరిగాడు. ఓ ఎండ్‌లో జశ్‌ప్రీత్ ఒత్తిడి పెంచగా.. మరో ఎండ్‌లో షమి వికెట్ల వేట విజయవంతంగా సాగించాడు. ఇంగ్లాండ్‌పై 10-1-69-5 గణాంకాలతో ఆకట్టుకున్నాడు. 22 ఓవర్లలో ఇంగ్లాండ్ 160/0తో దూకుడుగా ఆడింది. ఈ దశలో ఇంగ్లాండ్ 400 దాటేలా కనిపించింది. స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ 20-0-160-1 గణాంకాలతో భారీగా పరుగులు సమర్పించుకు న్నారు. కానీ ఇదే సమయంలో 31-40 ఓవర్లలో భారత్ కేవలం 43 పరుగులే ఇచ్చింది. దీంతో ఇంగ్లాండ్ స్కోరు పడిపోయింది. డెత్ ఓవర్ల నిపుణుడు జశ్‌ప్రీత్ బుమ్రా మరోసారి ప్రత్యేకత నిలుపుకున్నాడు. 10-1-44-1తో ఆకట్టుకున్నాడు. డెత్ ఓవర్లలో వేసిన ఐదు ఓవర్లలో బుమ్రా కేవలం 26 పరుగులే ఇచ్చి ఇంగ్లాండ్ స్కోరును కుదించాడు.